Andhra Pradesh: 2023లో ప్రభుత్వ సెలవు దినాలివే.. హాలిడే క్యాలెండర్ ప్రకటన వచ్చేసింది
ఏపీలో 2023 ఇచ్చే సాధారణ సెలవుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో సాధారణ సెలవులతో పాటు ఉద్యోగులకు లభించే ఆప్షనల్ హాలిడేస్, ఇతర సెలవుల వివరాలను కూడా ప్రభుత్వం ప్రకటించింది.

వచ్చే ఏడాది (2023)కి సంబంధించి ఉద్యోగులకు సాధారణ, ఐచ్ఛిక, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చంద్ర దర్శనం బట్టి సెలవులు ఇచ్చే రంజాన్, బక్రీద్, మొహరం, ఈద్ మిలాద్‌నబి వంటి పర్వదినాలు, తిథులను బట్టి హిందు పండుగల్లో ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే వాటిని ముందస్తుగా పత్రికా ప్రకటనల ద్వారా తెలియజేస్తామని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి గురువారం ఉత్తర్వులిచ్చారు. 2023లో మొత్తం 23 సెలవుల్ని ప్రభుత్వం సాధారణ సెలవులు ఉన్నాయి. అలాగే వచ్చే సంవత్సరంలో నాలుగు పండుగ సెలవులు.. సెకండ్ సాటర్ డే, ఆదివారాల్లో వచ్చాయి. ఇందులో భోగి పండుగ జనవరి 14న సెకండ్ సాటర్ డేన వచ్చింది. సంక్రాంతి పండుగ జనవరి 15న సండే రోజు వచ్చింది. అక్టోబర్ 22న దుర్గాష్టమి కూడా సండే రోజే వచ్చింది. నవంబర్ 12న దీపావళి కూడా ఆదివారమే వచ్చింది.
మిగిలిన సెలవుల వివరాలను దిగువన చూడండి
#AndhraPradesh: General Holidays and Optional Holidays for the Year 2023 pic.twitter.com/bvYegDcVor
— Janardhan Veluru (@JanaVeluru) December 15, 2022
ఆప్షనల్ హాలిడేస్ వివరాలు ఇలా ఉన్నాయి….
న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1, హజ్రత్ అలీ పుట్టినరోజు ఫిబ్రవరి 5న, షబే బరాత్ కారణంగా మార్చి 7న, మహావీర్ జయంతి నేపథ్యంలో ఏప్రిల్ 4న, షబే ఖదర్ సందర్భంగా ఏప్రిల్ 18న ఆప్షనల్ హాలిడేస్ అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 21న జమాతుల్ విదా, ఏప్రిల్ 23న బసవ జయంతి, ఏప్రిల్ 24న షహాదత్ హజ్రత్ అలీ, మే 5న బుద్ధ పూర్ణిమ, జూన్ 20న రథయాత్ర, జూలై 6న ఈద్ ఏ ఘదీర్, మొహర్రం 9వ రోజు సందర్భంగా జూలై 28, పార్సీ న్యూ ఇయర్ నేపథ్యంలో ఆగస్టు 16న కూడా ఆప్షనల్ హాలిడేస్ ప్రకటించారు. వరలక్ష్మీ వ్రతం నేపథ్యంలో ఆగస్టు 25న, అర్బయీన్ కారణంగా సెప్టెంబర్ 5న, హజ్రత్ సయ్యద్ మొహమ్మద్ జువాన్ పురి మెహదీ పుట్టినరోజు అవ్వడంతో సెప్టెంబర్ 9న, మహాలయ అమావాస్య కారణంగా అక్టోబర్ 14న, విజయదశమి పండగ నేపథ్యంలో అక్టోబర్ 24న , యజ్ దహుం షరీఫ్ కారణంగా అక్టోబర్ 26న, కార్తీక పౌర్ణిమ, గురునానక్ జయంతి ఉండటంతో నవంబర్ 27న, డిసెంబర్ 24న క్రిస్మస్ ఈవ్, డిసెంబర్ 26న బాక్సింగ్ డే సందర్భంగా ఆప్షనల్ హాలిడేస్ ఇచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
