Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పదవీ విరమణ వయసు పెంచుతూ ఏపీ సర్కార్ ఆర్డినెన్స్ జారీ

AP Govt.Employees Retirement: ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధప్రదేశ్ రాష్ట్ర సర్కార్ మరో శుభవార్త తీసుకువచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పదవీ విరమణ వయసు పెంచుతూ ఏపీ సర్కార్ ఆర్డినెన్స్ జారీ
Ap Govt
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 31, 2022 | 6:19 PM

AP Govt. Employees Retirement Age: ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర సర్కార్ మరో శుభవార్త తీసుకువచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు (Retirement Age) పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్న 60 ఏళ్ల వయసును నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy) ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ ఫైలుపై ఏపీ గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్ ఆమోద ముద్ర వేశారు. 2022 జనవరి 1నుంచి ఈ ఉత్వర్వులు అమలు చేయనున్నట్టుగా ఆర్డినెన్స్‌లో ప్రభుత్వం పేర్కొంది. కాగా, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకి ప్రభుత్వం పెంచుతూ.. మంత్రివర్గం తీర్మానం చేసి గవర్నర్‌కు పంపింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు అర్డినెన్స్‌ పైలుపై గవర్నర్ సోమవారం సంతకం చేశారు. జనవరి ఒకటో తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి.

ఇక, పదవీ విరమణ వయసుకు సంబంధించి ఈరోజు మధ్యాహ్నం వరకు ఆర్డినెన్స్ రాకపోవడంతో నేడు రిటైర్ కావాల్సిన ఉద్యోగుల్లో అయోమయం నెలకొంది. ఇప్పటివకే ఆయా విభాగాల ఉద్యోగులకు పదవీ విరమణ దస్త్రాలు చేరాయి. అయితే మధ్యాహ్నం తర్వాత ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో గందగోళానికి తెరపడింది. ఈరోజు పదవీ విరమణ చేసే వారికి ఊరట లభించింది.

ఇదిలా ఉంటే ఏపీలో పీఆర్సీ జీవోలపై వివాదం కొనసాగుతుంది. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న ఉద్యోగులు సమ్మెకు సిద్దమవుతున్నారు. మరోవైపు ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి పూర్తిస్థాయిలో అధ్యయనానికి ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. అయితే కమిటీతో చర్చలు జరిపేందుకు పీఆర్సీ సాధన సమితి నిరాకరించింది. అయితే తమ డిమాండ్లతో కూడిన లేఖను ప్రభుత్వ కమిటీకి అందజేసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించినప్పటికీ, ఉద్యోగులు రావడం లేదని మంత్రులు చెబుతున్నారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని వారు చెప్పుకొస్తున్నారు.

అయితే ఉద్యోగ సంఘాల ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. ఇప్పటికే తాము చాలా సార్లు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ప్రభుత్వం పీఆర్సీ జీవోలు ఏకపక్షంగా తీసుకోచ్చిందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్‌ను బయటపెట్టాలని, పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు పాత జీతాలే ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్నారు.

Read Also…..  Election King: 227వ సారి ఎన్నికల బరిలో దిగిన ‘ఎలక్షన్ కింగ్’.. గిన్నిస్‌ రికార్డు సొంతం చేసుకున్న తమిళవాసి!