AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP New Districts: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఏపీలో కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం..

AP New Districts: ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

AP New Districts: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఏపీలో కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం..
Ap New Districts
Shaik Madar Saheb
|

Updated on: Apr 03, 2022 | 2:26 AM

Share

AP New Districts: ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ఫైనల్‌ డ్రాఫ్ట్‌‌కు ఇప్పటికే ఆమోదించిన ఏపీ ప్రభుత్వం.. 26 జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను నియమిస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 26 జిల్లాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఇది వరకు 13 జిల్లాలు ఉండగా.. కొత్తగా మరో 13 జిల్లాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

జిల్లాల వారీగా కలెక్టర్ల వివరాలు..

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా శ్రీకేశ్‌ బాలాజీరావు కొనసాగింపు

విజయనగరం జిల్లా కలెక్టర్‌గా సూర్యకుమారి కొనసాగింపు

మన్యం జిల్లా కలెక్టర్‌గా నిశాంత్ కుమార్‌

విశాఖ జిల్లా కలెక్టర్‌గా మల్లికార్జున కొనసాగింపు

అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా సుమిత్‌ కుమార్‌

అనకాపల్లి కలెక్టర్‌గా రవి సుభాష్‌

కాకినాడ కలెక్టర్‌గా కృతికా శుక్లా

తూర్పు గోదావరి కలెక్టర్‌గా మాధవీలత

కోనసీమ కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా

పశ్చిమ గోదావరి కలెక్టర్‌గా పి.ప్రశాంతి

ఏలూరు కలెక్టర్‌గా ప్రసన్న వెంకటేశ్‌

కృష్ణా జిల్లా కలెక్టర్‌గా రంజిత్‌ బాషా

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌గా ఎస్‌.దిల్లీరావు

గుంటూరు కలెక్టర్‌గా వేణుగోపాల్‌రెడ్డి

పల్నాడు జిల్లా కలెక్టర్‌గా శివశంకర్‌

బాపట్ల జిల్లా కలెక్టర్‌గా విజయ

ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా దినేశ్‌ కుమార్

నెల్లూరు జిల్లాగా చక్రధర్‌ బాబు

శ్రీబాలాజీ జిల్లా కలెక్టర్‌గా వెంకటరమణారెడ్డి

చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా హరినారాయణ

అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా శ్రీ గిరీష

కడప కలెక్టర్‌గా విజయరామరాజు

శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్‌గా పి.బసంత్‌ కుమార్‌

అనంతపురం కలెక్టర్‌గా ఎస్‌.నాగలక్ష్మి

నంద్యాల కలెక్టర్‌గా మనజీర్‌ జిలాని శామూన్‌

కర్నూలు జిల్లా కలెక్టర్‌గా కోటేశ్వరరావు

ఎస్పీల వివరాలు..

శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా జి.ఆర్‌.రాధిక

విజయనగరం ఎస్పీగా ఎం.దీపిక కొనసాగింపు

పార్వతీపురం ఎస్పీగా వాసన విద్య సాగర్‌ నాయుడు

అనకాపల్లి ఎస్పీగా గౌతమి సాలి

అల్లూరి సీతారామరాజు ఎస్పీగా సతీశ్‌కుమార్

కాకినాడ ఎస్పీగా రవీంద్రనాథ్‌ బాబు

కోనసీమ జిల్లా ఎస్పీగా కె.ఎస్‌.ఎస్‌.వి. సుబ్బారెడ్డి

తూర్పు గోదావరి జిల్లా ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి

పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా రవిప్రకాశ్‌

ఏలూరు ఎస్పీగా ఆర్‌.ఎన్‌. అమ్మిరెడ్డి

కృష్ణా జిల్లా ఎస్పీగా సిద్ధార్థ కౌశల్‌ కొనసాగింపు

విజయవాడ కమిషనర్‌గా క్రాంతి రాణా టాటా కొనసాగింపు

గుంటూరు ఆర్బన్‌ ఎస్పీగా కె.ఆరీఫ్‌ హాఫీజ్‌ కొనసాగింపు

పల్నాడు జిల్లా ఎస్పీగా రవిశంకర్‌రెడ్డి

బాపట్ల జిల్లా ఎస్పీగా వకుల్‌ జిందాల్‌

ప్రకాశం జిల్లా ఎస్పీగా మల్లిక గార్గ్‌ కొనసాగింపు

నెల్లూరు ఎస్పీగా సీహెచ్‌ విజయరావు కొనసాగింపు

తిరుపతి ఎస్పీగా పరమేశ్వర్‌రెడ్డి

చిత్తూరు ఎస్పీగా రిశాంత్‌రెడ్డి

అన్నమయ్య ఎస్పీగా హర్షవర్ధన్‌రాజు

కడప ఎస్పీగా అన్బూరాజన్‌ కొనసాగింపు

అనంతపురం ఎస్పీగా ఫకీరప్ప కొనసాగింపు

శ్రీసత్యసాయి ఎస్పీగా రాజుల్‌ దేవ్‌ సింగ్‌

కర్నూలు జిల్లా ఎస్పీగా సుధీర్‌కుమార్‌రెడ్డి

నంద్యాల ఎస్పీగా కె.రఘువీరారెడ్డి

విశాఖ కమిషనర్‌గా సీహెచ్‌. శ్రీకాంత్

Also Read:

AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల ప్రక్రియ పూర్తి.. చిన్నచిన్న మార్పులకు ఆమోదం తెలిపిన రాష్ట్ర కేబినెట్‌

Andhra Pradesh: పత్తికొండ రాజకీయాలను షేక్ చేస్తున్న ఒకే ఒక్క ఫోటో.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..!