Telugu News » Andhra pradesh » Andhra pradesh former cm ys rajasekhara reddy vardhanthi cm ys jagan and sharmila pays tribute ysr ghat at pulivendula
YSR Vardhanthi: దివంగత నేత వైఎస్సార్‌కు ఘన నివాళి.. ఇడుపులపాయలో సీఎం జగన్‌తో కలిసి షర్మిల ప్రత్యేక ప్రార్థనలు
Balaraju Goud |
Updated on: Sep 02, 2021 | 9:43 AM
దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నివాళ్లులర్పించారు.
Ysr Vardhanthi
YS Rajasekhara Reddy Vardhanthi: దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ ఘాట్ వద్ద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, వైఎస్‌ఆర్ తెలంగాణ అధ్యక్షురాలు షర్మిల కుటుంబసభ్యులు ప్రత్యేక ప్రార్ధనలు చేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్‌ను స్మరించుకుంటూ మౌనం పాటించారు.