AP EAPCET 2023 Rankers List: ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్‌లో టాప్ ర్యాంకర్లు వీరే.. ఈసారి ర్యాంకులన్నీ వారివే!
ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్-2023 ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో బుధవారం (జూన్ 14) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా ఫలితాల్లో అమ్మాయిలు సత్తాచాటారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ రెండు స్ట్రీముల్లోనూ అబ్బాయిలకు టాప్ ర్యాంకులు..
ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్-2023 ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో బుధవారం (జూన్ 14) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా ఫలితాల్లో అమ్మాయిలు సత్తాచాటారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ రెండు స్ట్రీముల్లోనూ అబ్బాయిలకు టాప్ ర్యాంకులు వచ్చినప్పటికీ.. అమ్మాయిలే అత్యధికంగా అర్హత సాధించారు. ఇంజినీరింగ్‌లో అమ్మాయిలు 78.67 శాతం, అబ్బాయిలు 74.68 శాతం మంది అర్హత సాధించారు. ఇక అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో అమ్మాయిలు 89.94 శాతం, అబ్బాయిలు 88.95 శాతం మంది అర్హత పొందారు. మొత్తం 3,15,297 మంది ఈఎపీసెట్‌కు దరఖాస్తు చేసుకోగా.. 2,52,717 మంది అర్హత పొందారు. వీరిలో అబ్బాయిలు 1,21,999, అమ్మాయిలు 1,30,718 మంది అర్హత సాధించారు. ఇంజినీరింగ్‌కు 2,24,724 మంది పరీక్ష రాయగా.. వీరిలో 1,71,514 (76.32%) మంది అర్హత సాధించారు. బైపీసీ స్ట్రీమ్‌లో 90,573 మంది పరీక్ష రాస్తే 81,203 మంది అర్హత సాధించారు.
ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో టాప్ 3 ర్యాంకులు..
- ఎన్టీఆర్ జిల్లాకు చెందిన చల్లా ఉమేష్ వరుణ్ 158.0313 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు.
- హైదరాబాద్‌కు చెందిన బిక్కిన అభినవ్ చౌదరి 157.2624 మార్కులతో సెకండ్ ర్యాంకు సాధించాడు.
- పల్నాడు జిల్లాకు చెందిన నందిపాటి సాయి దుర్గారెడ్డి 155.2980 మార్కులతో థార్డ్ ర్యాంకు సాధించాడు.
అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో టాప్ 3 ర్యాంకులు..
- తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బూరుగుపల్లి సత్యరాజ జశ్వంత్ 153.8815 మార్కులతో ఫస్ట్ ర్యాంకు సాధించాడు.
- శ్రీకాకుళం జిల్లాకు చెందిన బోర వరుణ్ చక్రవర్తి 151.0651 మార్కులతో సెకండ్ ర్యాంకు సాధించాడు.
- సికింద్రాబాద్‌కు చెందిన కొన్ని రాజ్ కుమార్ 151.5285 మార్కులతో థార్డ్ ర్యాంక్ సాధించాడు.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.