Pawan Kalyan: అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ఎవరు ఆపుతారో చూస్తా.. పవన్ కల్యాణ్ సవాల్
ఈసారి అసెంబ్లీలో తప్పకుండా అడుగుపెడతానని.. తనను ఎవరు అడ్డుకుంటారో చూస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సవాల్ చేశారు. వారాహి విజయ యాత్రలో భాగంగా కాకినాడ జిల్లా కత్తిపూడిలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ పాల్గొని ప్రసంగించారు.
ఈసారి అసెంబ్లీలో తప్పకుండా అడుగుపెడతానని.. తనను ఎవరు అడ్డుకుంటారో చూస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సవాల్ చేశారు. వారాహి విజయ యాత్రలో భాగంగా కాకినాడ జిల్లా కత్తిపూడిలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ పాల్గొని ప్రసంగించారు. అసెంబ్లీలోకి అడుగుపెట్టకుండ తనపై కక్షగట్టి.. గాజువాక, భీమవరంలో ఓడించారని గుర్తు చేశారు. తాను అసెంబ్లీలో అడుగుపెట్టకుండా దమ్ముంటే అడ్డుకోవాలని సీఎం జగన్‌కు సవాలు చేశారు. అమరావతే రాజధానిగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఒకవేళ గాజువాకలో తనను గెలిపించి ఉంటే కనీసం రుషికొండనైనా కాపాడేవాడినని చెప్పారు. ఎన్నికల్లో మద్యపాన నిషేధమని చెప్పిన వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యంపై ఏటా రూ.25వేల కోట్ల ఆదాయం పొందుతోందని విమర్శలు గుప్పించారు. సీపీఎస్ రద్దు చేస్తామని గొప్పగా చెప్పి.. చేతల్లో చూపించలేకపోయారని మండిపడ్డారు. అమరావతిలో రైతుల ఆత్మహత్యలకు వైసీపీ ప్రభుత్వమే కారణమన్నారు. సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతి రాజధానిని ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు. రాజధానిపై కుల ముద్ర వేయటం దారుణమని పేర్కొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..