విశాఖపట్నం: మిస్టరీగా ఆమె మరణం.. అనుమానాలెన్నో..? కీలకంగా మారనున్న పోస్టుమార్టం

| Edited By: Srilakshmi C

Aug 25, 2023 | 6:33 PM

విశాఖలో కళావతి అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి కలకలం రేపుతోంది. త్రి టౌన్ ఎల్ఐసి క్వార్టర్స్ లో ఇంట్లో విగత జీవిగా మారింది. భర్త ఎల్ఐసీ ఉద్యోగి కాగా.. ఆమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్దకొడుకు ఎంబీబీఎస్‌ విద్యార్థి. ఇంట్లో ఎవరూ లేని..

విశాఖపట్నం: మిస్టరీగా ఆమె మరణం.. అనుమానాలెన్నో..? కీలకంగా మారనున్న పోస్టుమార్టం
Kalawathi
Follow us on

విశాఖపట్నం, ఆగస్టు 25: విశాఖలో కళావతి అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి కలకలం రేపుతోంది. త్రి టౌన్ ఎల్ఐసి క్వార్టర్స్ లో ఇంట్లో విగత జీవిగా మారింది. భర్త ఎల్ఐసీ ఉద్యోగి కాగా.. ఆమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్దకొడుకు ఎంబీబీఎస్‌ విద్యార్థి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కళావతి అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోయింది. అసలు ఇది హత్యా.. లేదా హత్య చేసి ఆత్మహత్యగా ప్రచారం చేస్తున్నారా? అనే అంశం మిస్టరీగా మారింది. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

వివాహిత కళావతి అనుమాన సద మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు. భర్త గురుమూర్తి ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె చనిపోయిందని బావ అంటున్నారని కళావతి సోదరుడు చెబుతున్నాడు. అక్క చనిపోయినట్టు కనీసం సమాచారం ఇవ్వలేదని అంటున్నాడు మృతురాలి సోదరుడు తిరుపతిరావు. ఇరుగుపొరుగువారు సమాచారం ఇచ్చేంత వరకూ చనిపోయినట్టు తెలియదని మృతురాలి సోదరుడు తిరుపతిరావు అంటున్నాడు.

ఇంట్లోకి వచ్చి చూసినప్పటికే..

కళావతి మృతి తనకు షాక్‌కు గురి చేసిందని భర్త గురుమూర్తి అంటున్నాడు. ఏం జరిగిందో తెలియదని చెబుతున్నాడు. తాను డ్యూటీ నుంచి వస్తూ వస్తూ కొడుకును తీసుకుని వచ్చానని, ఇంటికి వచ్చి చూసేసరికి.. ఇంట్లో కళావతి విగత జీవిగా పడి ఉందని చెప్పుకొస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

పోస్టుమార్టం తర్వాత..

కళావతి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం పూర్తయ్యాక కళావతి మృతికి గల అసలు కారణాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు. కుటుంబ సభ్యులను విచారిస్తున్నామని, దర్యాప్తు పూర్తయ్యేంత వరకూ కళావతి మృతిపై ఉన్న అనుమానాలు వీడిపోవని తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.