Andhra Pradesh: ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ అమలు.. పూర్తి వివరాలివే..

|

Jan 27, 2023 | 4:35 PM

మార్చి 1 నుంచి పూర్తిస్థాయలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్పెప్ట్‌‌ను రాష్ట్రంలోన అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో వైద్యశాఖపై సమీక్ష చేపట్టిన జగన్..

Andhra Pradesh: ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ అమలు.. పూర్తి వివరాలివే..
Cm Jagan
Follow us on

మార్చి 1 నుంచి పూర్తిస్థాయలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్పెప్ట్‌‌ను రాష్ట్రంలోన అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో వైద్యశాఖపై సమీక్ష చేపట్టిన జగన్.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శుక్రవారం(జనవరి 27) తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ సమీక్షా నిమిత్తం.. సంబంధిత శాఖ మంత్రి విడదల రజిని, రాష్ట్ర సీఎస్‌ జవహార్‌రెడ్డి, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు జగన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 1 నుంచి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్పెప్ట్‌ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి.

అలాగే అదే రోజు నుంచి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆస్పత్రుల సందర్శన ప్రారంభించాలన్నారు. మార్చి 1వ తేదీ నుంచే.. గోరుముద్దలో భాగంగా వారానికి మూడుసార్లు పిల్లలకు రాగిమాల్ట్‌ పంపిణీ ప్రారంభించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే ఉన్న, కొత్తగా నిర్మిస్తున్న అన్ని బోధనాసుపత్రుల్లో క్యాన్సర్‌ నివారణా పరికరాలు, చికిత్సలతోపాటు, కాథ్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.