AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: వైజాగ్‌కు షిఫ్ట్ అవ్వనున్న సీఎం జగన్.. ముహూర్తం ఫిక్స్.. ! శ‌ని, ఆదివారాల్లో మాత్రం..

విశాఖ నుంచి పాల‌న‌కు సీఎం జ‌గ‌న్ సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే వైజాగ్‌కి మకాం మార్చబోతున్నారు ఏపీ సీఎం. అక్కడినుంచే పాలన సాగించబోతున్న సీఎం.. శ‌ని, ఆదివారాల్లో మాత్రం అమ‌రావ‌తిలో అందుబాటులో ఉంటారు. జీ-20 స‌ద‌స్సు విశాఖ‌లో జ‌ర‌గ‌నుండ‌టంతో ఆ సమావేశాలు ముగిశాక సీఎం షిఫ్ట్ అవుతున్నారు.

Andhra: వైజాగ్‌కు షిఫ్ట్ అవ్వనున్న సీఎం జగన్.. ముహూర్తం ఫిక్స్.. ! శ‌ని, ఆదివారాల్లో మాత్రం..
CM Jagan
Ram Naramaneni
|

Updated on: Mar 11, 2023 | 6:47 PM

Share

అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయ‌మ‌ని చెబుతున్న ఏపీ సీఎం జ‌గ‌న్.. విశాఖ కేంద్రంగా పాల‌న ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ముందుగా ఉగాది రోజున విశాఖ‌లో త‌న కార్యాల‌యం ఏర్పాటుచేయాల‌ని భావించినా కొన్ని కార‌ణాల‌తో వాయిదా ప‌డినట్లు తెలుస్తోంది. ఈనెల 14 నుంచి అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభమవుతుండటంతో సీఎం బిజీగా ఉంటార‌ంటున్నాయి ప్రభుత్వ వ‌ర్గాలు.

ఉగాది రోజు విశాఖ‌లో సీఎం కార్యాల‌యం ప్రారంభించాలంటే అధికారులు అక్కడ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అందుకే అసెంబ్లీ ముగిసిన త‌ర్వాత ఏప్రిల్ మొద‌టివారంలో విశాఖకు షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు సీఎం జగన్‌. గ్లోబ‌ల్ ఇన్వెస్టర్స్ స‌మ్మిట్‌లో కూడా విశాఖ రాజ‌ధాని అంశాన్ని ప్రస్తావించారు సీఎం. త్వరలోనే తాను విశాఖ నుంచి పాల‌న చేస్తాన‌ని చెప్పారు. దీనికి త‌గ్గట్లుగానే సీఎం క్యాంపు కార్యాల‌యం కోసం విశాఖ‌లో ఇప్పటికే పోర్ట్ గెస్ట్ హౌస్‌ని సిద్ధం చేస్తున్నారు.

సోమ‌, మంగ‌ళ వారాల్లో విశాఖ నుంచి సీఎం పాల‌న సాగిస్తార‌ని మొద‌ట్లో చెప్పుకొచ్చారు. బుధ‌వారం ప‌ల్లె నిద్ర కార్యక్రమాంలో సీఎం సీఎం పాల్గొంటార‌న్నది ముందుగా అనుకున్న షెడ్యూల్. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు, మ‌రోవైపు విశాఖ‌లో జీ-20 సద‌స్సు రెండూ నెలాఖ‌రుకు ముగుస్తాయి. ఆ త‌ర్వాత ఏప్రిల్ నుంచి పాల‌న ప్రారంభించేలా సీఎంఓ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం కార్యాల‌యంతో పాటు ఆయ‌న‌కు అనుబంధంగా ఉండే జీఏడీ కూడా విశాఖ త‌ర‌లివెళ్తుంద‌ని స‌మాచారం.మొత్తంగా ఏప్రిల్ నుంచి విశాఖ రాజ‌ధానిగా పాలనకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది జగన్‌ ప్రభుత్వం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఆరు గ్రహాల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని సంపద, ఏది అనుకుంటే..
ఆరు గ్రహాల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని సంపద, ఏది అనుకుంటే..
ఆ ఒక్క కారణంతో 15 సినిమాలు నాకు రాలేదు..
ఆ ఒక్క కారణంతో 15 సినిమాలు నాకు రాలేదు..
పోస్టాఫీస్ బంపర్ ఆఫర్.. రూ.370 పొదుపుతో చేతికి రూ.8 లక్షలు..
పోస్టాఫీస్ బంపర్ ఆఫర్.. రూ.370 పొదుపుతో చేతికి రూ.8 లక్షలు..
టీ20 ప్రపంచకప్ 2026లోనే తోపు ఈ ఓపెనర్.. ఒక్కసారి కూడా ఔట్ కాలే..
టీ20 ప్రపంచకప్ 2026లోనే తోపు ఈ ఓపెనర్.. ఒక్కసారి కూడా ఔట్ కాలే..
బరువైన దుప్పట్లు సులభంగా ఉతకడం ఎలా? ఈజీ హోమ్ క్లీనింగ్ టిప్స్‌
బరువైన దుప్పట్లు సులభంగా ఉతకడం ఎలా? ఈజీ హోమ్ క్లీనింగ్ టిప్స్‌
మమ్మల్ని తక్కువగా చూడొద్దు.! జింబాబ్వే గట్టి వార్నింగ్
మమ్మల్ని తక్కువగా చూడొద్దు.! జింబాబ్వే గట్టి వార్నింగ్
4 ఏళ్ల పెళ్లి బంధానికి ముగింపు చెప్పిన టీమిండియా ప్లేయర్..
4 ఏళ్ల పెళ్లి బంధానికి ముగింపు చెప్పిన టీమిండియా ప్లేయర్..
టొమాటో దోసె.. 5 నిముషాల్లో ఇలా చేసేయండి.. రుచి అదిరిపోతోంది!
టొమాటో దోసె.. 5 నిముషాల్లో ఇలా చేసేయండి.. రుచి అదిరిపోతోంది!
అరటి కాయలతో అదిరిపోయే లాభాలు.. తెలిస్తే తొక్కను కూడా వేస్ట్ చేయరు
అరటి కాయలతో అదిరిపోయే లాభాలు.. తెలిస్తే తొక్కను కూడా వేస్ట్ చేయరు
ఆరోగ్యానికి మంచివే.. అతిగా తింటే మాత్రం ఆ సమస్యలు తప్పవు
ఆరోగ్యానికి మంచివే.. అతిగా తింటే మాత్రం ఆ సమస్యలు తప్పవు