Gold Rate Today: పసిడి ప్రియులకు అలర్ట్.. బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. ఏపీ, తెలంగాణలో నేటి రేట్లు ఇవే..
భారతదేశంలో లక్షలాది మందికి బంగారం ధరలను గమనించడం ఒక దైనందిన ఆచారం. ఎందుకంటే ఈ పసుపు లోహాన్ని సంపాదించడం అనేక సందర్భాలలో ఒక పవిత్రమైన సంప్రదాయంగా పరిగణించబడుతుంది. పెళ్లిళ్ల సీజన్, ప్రధాన పండుగల సమయంలో దీనికి డిమాండ్ గణనీయంగా పెరుగుతుంది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొంత ఉపశమనం పొందారు. ఈ క్రమంలోనే తాజా పరిస్థితి మళ్లీ మారింది. ఇవాళ్టికి బంగారం, వెండి ధరల్లో భారీ మార్పు చోటు చేసుకుంది.

Gold Rate Today: ఇరాన్, అమెరికా యుద్ధం ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది. వార్ ఎఫెక్ట్ అన్ని దేశాలను ఏదో విధంగా ప్రభావితం చేసింది. మధ్యప్రాచ్య వివాదాన్ని పరిష్కరించేందుకు చర్చలు జరిగే అవకాశాల నేపథ్యంలో ఇరాన్‌పై దాడులను రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రకటించడంతో బంగారం ధరలు పెరిగాయి. ఫిబ్రవరి చివరిలో అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, బంగారం, వెండి ధరలలో తీవ్రమైన హెచ్చుతగ్గులు చోటుచేసుకున్నాయి.
ఇంధన ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణంపై ఆందోళనలు తగ్గుముఖం పట్టడంతో, పెట్టుబడిదారులు స్వల్పకాలిక నష్టభయాలను పునఃసమీక్షించుకోవడంతో ఇటీవలి రోజుల్లో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బంగారం, వెండి ధరలపై Tv9 వెబ్ సైట్‌లో ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందిస్తుంది. నగరాల వారీగా బంగారం, వెండి యొక్క తాజా సమాచారం తెలుసుకోండి.
భారతదేశంలో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,53,830, 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ.1,41,010లకు పెరిగింది. హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
– చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,54,920 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,42,010 గా ఉంది.
– ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,53,830, 22 క్యారెట్ల ధర రూ.1,41,010 గా ఉంది.
– ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,53,980, 22 క్యారెట్ల ధర రూ.1,41,160లు గా ఉంది.
– కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,53,830, 22 క్యారెట్ల ధర రూ.1,41,010 గా ఉంది.
– బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,53,830, 22 క్యారెట్ల ధర రూ.1,41,010 గా ఉంది.
– హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,53,830, 22 క్యారెట్ల ధర రూ.1,41,010 గా ఉంది.
– విజయవాడలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,53,830, 22 క్యారెట్ల ధర రూ.1,41,010 గా ఉంది.
– విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,53,830, 22 క్యారెట్ల ధర రూ.1,41,010 గా ఉంది.
సిల్వర్ సైతం భారీగా పెరిగింది. నేడు వెండి ధర గ్రాము రూ265.10, కిలో రూ.2,65,100లకు చేరింది.
బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
