Pawan Kalyan: ఇక మొదలెడదామా.. 4 రోజులపాటు బిజీబిజీగా పవన్. గన్నవరంలో స్టైలిష్ ఎంట్రీ..
గత కొన్నిరోజులుగా సినిమా షూటింగ్స్‌తో ఉన్న జనసేనాని మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్‌లో బిజీగా మారారు. నాలుగు రోజుల పాటు విజయవాడలో ఉండేందుకు శనివారం సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. జనసేన పదో ఆవిర్భావ దినోత్సవ వేడుకల నేపథ్యంలో పవన్ కళ్యాణ్...

గత కొన్నిరోజులుగా సినిమా షూటింగ్స్‌తో ఉన్న జనసేనాని మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్‌లో బిజీగా మారారు. నాలుగు రోజుల పాటు విజయవాడలో ఉండేందుకు శనివారం సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. జనసేన పదో ఆవిర్భావ దినోత్సవ వేడుకల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నగరానికి చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్‌లో సరికొత్త లుక్‌లో కనిపించిన పవన్ ఫ్యాన్స్‌ను ఫిదా చేశారు. బ్లాక్ టీషర్ట్, ఆర్మీ కలర్ ప్యాంట్ ధరించి వచ్చిన పవన్ కొత్త లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. శనివారం సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన పవన్.. రోడ్డు మార్గాన విజయవాడ బయలు దేరారు.
జనసేన పదో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మార్చి 14న మచిలీపట్నంలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు విభాగాల నేతలతో ఆయన ప్రత్యేకంగా ముందుగా సమావేశం కానున్నారు. అనంతరం 13వ తేదీన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల నిర్వహణపై సమీక్ష నిర్వహించనున్నారు. ఆ తర్వాతగవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్‌ను రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు.
ఇదిలా ఉంటే పార్టీ ఆవిర్భావ సభలో పవన్ పలు నిర్ణయాలు ప్రకటిస్తారని.. ఆ సభలోనే మెనిఫెస్టోపైనా క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది. దీంతో ఈ సభపై అందరిలోనూ ఆసక్తినెలకొంది. పొత్తులపై కూడా పవన్ ఈ సభలో క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మరి పవన్ ఎలాంటి నిర్ణయాలను ప్రకటిస్తారో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. ఇక పవన్ నాలుగు రోజుల పాటు విజయవాడలో అందుబాటులో ఉండనుండడంతో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవాడ నగరానికి తరలివస్తున్నారు.
గన్నవరం విమానాశ్రయం చేరుకున్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు. మరికొద్ది నిమిషాల్లో మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరుగుతున్న BC రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొననున్నారు. pic.twitter.com/cZM0zPVw0k
— JanaSena Party (@JanaSenaParty) March 11, 2023
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..




