Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. నేరుగా మీ వద్దకే.. టీటీడీ సరికొత్త నిర్ణయం
భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు టీటీడీ సరికొత్త ఆలోచన చేసింది. ఎండ ప్రభావం క్రమంలో భక్తులు ఇబ్బంది పడకుండా సరికొత్త నిర్ణయం తీసుకుంది. తిరుమలలో త్రాగునీరు కోసం భక్తులు ఇబ్బంది పడకూడదని టీీటీడీ భావిస్తోంది. అందులో భాగంగా నేరుగా భక్తుల వద్దకే వెళ్లి అందించనుంది.

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ తెలిపింది. వేసవికాలం సెలవులు వస్తుండటంతో తిరుమలకు భక్తుల తాకిడి మరింత పెరిగింది. సమ్మర్ కావడంతో భక్తులు ఇబ్బంది పడకుండా తాగునీటి సౌకర్యం కల్పించాలని టీటీడీ అధికారులు భావించారు. అందులో భాగంగా సరికొత్త ఆలోచన చేశారు. నేరుగా భక్తుల వద్దకే వెళ్లి త్రాగునీరు అందించాలని నిర్ణయించారు. దీంతో తాగునీటి కోసం భక్తులు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. వేసవి దృష్ట్యా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆలయం లోపల, బయట రద్దీగా ఉన్న ప్రాంతాల్లో భక్తుల వద్దకు వెళ్లి శ్రీవారి సేవకులు త్రాగునీరు అందిస్తారు. ఇందుకోసం మొబైల్ జల ప్రసాదం విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా స్టీల్ గ్లాసుల్లో నీటిని నింపి భక్తులకు అందిస్తున్నారు.
మూడు షిఫ్టుల్లో జల ప్రసాదం
ప్రస్తుతం మూడు షిప్టుల్లో శ్రీవారి సేవకులు భక్తులకు జల ప్రసాదం అందిస్తున్నారు. నిరంతరం ఈ సరఫరా కొనసాగుతూ ఉంటుంది. భక్తులకు తాగునీటిని పంపిణీ చేసేందుకు టీటీడీ 15 లీటర్ల క్యాన్‌ను తయారు చేయించింది. వీటిని శ్రీవారి సేవకులు భూజాలకు తగిలించుకుని రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఉంటారు. అక్కడ భక్తుల వద్దకు వెళ్లి స్టీల్ గ్లాసుల్లో నీటిని అందిస్తారు. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ విధానాన్ని టీటీడీ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. అది విజయవంతం కావడం, భక్తుల నుంచి అద్బుత స్పందన రావడంతో పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రారంభించింది. వేసవి కారణంగా మరిన్ని క్యాన్లను అందుబాటులోకి తెచ్చింది. 60 మంది సేవకులను ఇందుకోసం నియమించింది. వీళ్లు కొండపైన, ఆలయం లోపల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉంటారు.
అన్న ప్రసాద కేంద్రాలు పెంపు
ఇక తిరుమలలో అన్న ప్రసాద కేంద్రాలను కూడా ఇటీవల టీటీడీ పెంచింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సేవకుల సాయంతో అన్న ప్రసాదం అందిస్తోంది. కొండపై భక్తులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వీరి సాయంతో అందిస్తోంది. అయితే తిరుమల కొండపై ఎక్కడికక్కడ జల ప్రసాద కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. కానీ కొండపై ప్లాస్టిక్‌ను నిషేధించిన టీటీడీ.. గాజు బాటిళ్లను మాత్రమ ఉపయోగించాలని ఆదేశించింది. దీంతో భక్తులు వీటిని కొనుగోలు చేసి జల ప్రసాద కౌంటర్ల వద్ద నీటిని పట్టుకుని త్రాగుతున్నారు. అయితే వేసవికాలం కావడం, ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో భక్తులు ఇబ్బంది పడకూడదనే కారణంతో నేరుగా వారి వద్దకే వెళ్లి నీటిని అందించాలని నిర్ణయించింది. ఈ విధానం బాగుందని భక్తులకు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.
