అందాలతో దుమ్మురేపిన క్రేజీ బ్యూటీ నభ నటేష్..  

Rajeev 

8 April 2026

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే క్లిక్ అయిన హీరోయిన్ నభా నటేష్. ఈ బ్యూటీకి విపరీతమైన క్రేజ్ ఉంది.

2018లో సుధీర్ బాబు నటించిన నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది అందాల భామ నభా నటేష్.

అంతకు ముందు కొన్ని కన్నడ సినిమాల్లో మెరిసిందీ అందాల తార. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైందీ అందాల తార.

ఇస్మార్ట్ శంకర్ తన అందం నటనతో ఆకట్టుకుంది. ఆతర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది.

డిస్కో రాజా, అదుగో, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో తదితర సినిమాల్లో నటా నటేష్ అభినయానికి మంచి మార్కులు పడ్డాయి.

అదే సమయంలో ప్రమాదానికి గురవ్వడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు తిరిగి కోలుకొని వరుసగా సినిమాలను లైనప్ చేసింది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.