Andhra Pradesh: వారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. నేరుగా ఖాతాల్లోకి రూ.10 వేలు జమ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనవరి 30న పల్నాడు జిల్లా వినుకొండలో పర్యటించి జగనన్న చేదోడు నిధులను విడుదల చేయనున్నారు.

చిన్న తరహా వ్యాపారస్తులందరికీ (చేతి వృత్తుల వారు)… జగన్ సర్కార్ ప్రోత్సాహక పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీని ద్వారా దర్జీలు, రజకులు, నాయి బ్రాహ్మణులకు చేదోడుగా ఉంటుంది ప్రభుత్వం. తాజాగా అర్హులైన చేదోడు పథక లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు తెలిపింది. ఈ పథకం కింద.. రూ. 10,000 చొప్పున ఏటా సాయాన్ని సాయం అందిస్తుంది ప్రభుత్వం. ఈ నగదు వారికి అవసరమైన చేతి పనిముట్లు, పెట్టుబడికి ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే.. జనవరి 30, సోమవారం సీఎం వైఎస్ జగన్ పల్నాడు జిల్లా వినుకొండ పర్యటించనున్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.40 గంటలకు ముఖ్యమంత్రి వినుకొండ చేరుకుంటారు. 11.05 – 12.20 గంటల మధ్య వినుకొండ వెల్లటూరు రోడ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగసభలో పాల్గొని, జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.05 గంటలకు అక్కడినుంచి బయలుదేరి 1.45 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
పాత లబ్ధిదారులు, కొత్తగా దరఖాస్తు చేసిన వారు కాస్ట్, ఇన్‌కమ్, లేబర్ సర్టిఫికెట్‌లు సబ్మిట్ చేయాలనే షరతు పెట్టింది ప్రభుత్వం. అయితే జనవరి 26 వరకే అందుకు సమయం ఇచ్చింది. గణంతంత్ర దినోత్సవం(జనవరి 26) సెలవు కావడంతో చాలా మంది వీటిని ఇవ్వలేకపోయారు. దీంతో కొందరు లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ పథకానికి అర్హతలు
- ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి
- తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి
- రజక, నాయిబ్రాహ్మణ, టైలరింగ్ వృత్తి చేస్తున్నవారు అయి ఉండాలి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం
