AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: నేడే ఏపీ కేబినెట్ మీటింగ్.. సీఎం అధ్యక్షతన భేటీ.. కీలక నిర్ణయాలపై చర్చ..

ఆంధ్రప్రదేశ్ మంత్రవర్గం నేడు సమావేశం కానుంది. ఉదయం 11-00 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రులు భేటీ కానున్నారు. సచివాలయం 1 నెంబర్ బ్లాక్ లో ఈ సమావేశం జరగనుంది...

Ganesh Mudavath
|

Updated on: Dec 13, 2022 | 8:08 AM

Share

ఆంధ్రప్రదేశ్ మంత్రవర్గం నేడు సమావేశం కానుంది. ఉదయం 11-00 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రులు భేటీ కానున్నారు. సచివాలయం 1 నెంబర్ బ్లాక్ లో ఈ సమావేశం జరగనుంది. 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్ పై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు, రానున్న అసెంబ్లీ సమావేశాలు, జగన్ అన్న కాలనీ లో గృహ నిర్మాణాలు పై ప్రత్యేక చర్చ, ఇటీవల తుపాను ప్రభావం వల్ల నష్టం పోయిన రైతులకు గిట్టుబాటు ధర పై చర్చ జరపనున్నారు. ఈ మేరకు కేబినెట్ ఆమోదం కోసం పంపే ప్రతిపాదనలను ఆయా శాఖల అధికారులు ఈ నెల 9వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా నిర్ధేశించిన విధంగా పంపాలని ఆదేశిస్తూ సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి గతంలో ఆదేశాలిచ్చారు. గతంలో జరిగిన కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతికి సంబంధించిన నివేదికను కూడా సమర్పించాలని ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు అవుతున్న సందర్భంగా.. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు.. మాండూస్ తుపాను పెను విధ్వంసం సృష్టించింది. దక్షిణ కోస్తా తో పాటు రాయలసీమ జిల్లాలను వణికించింది. వేల ఎకరాల్లో పంట నష్టం మిగిల్చింది. దీంతో అన్నదాతలు బావురుమంటున్నారు. ఈ పరిస్థితిపై సీఎం జగన్ స్పందించారు. తుపానుతో జరిగిన నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. రంగుమారిన, తడిసిన ధాన్యమైనా సరే కొనుగోలు చేయలేదన్న మాట ఎక్కడా రాకూడదని కలెక్టర్లను ఆదేశించారు. రైతుల పట్ల అత్యంత మానవతా దృక్పథంలో వ్యవహరించాలని సూచించారు.

ఇళ్లు ముంపునకు గురైతే ఒక్కో ఫ్యామిలీకి రూ.2వేలు ఆర్థిక సహాయం అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అంతే కాకుండా రేషన్‌ కూడా అందించాలన్నారు. పట్టణాలు, పల్లెలు అన్నది చూడకుండా బాధితులందరికీ సమానంగా సహాయం అందించాలని సూచించారు. గోడ కూలి ఒకరు చనిపోయినట్లు తనకు తెలిసిందని.. ఆ ఫ్యామిలీకి వెంటనే పరిహారం అందించి.. ధైర్యం చెప్పాలని సీఎం సంబంధిత అధికారులకు చెప్పారు. ఇలాంటి సమయాల్లో అండగా నిలబడితేనే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తు పెట్టుకుంటారని సీఎం జగన్ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..