AP-Telangana Water Disputes: తెలంగాణ మంత్రుల తీరుపై ఫైర్ అయిన విష్ణువర్ధన్ రెడ్డి.. ప్రాజెక్టులను అడ్డుకోవడం సరికాదంటూ..

AP-Telangana Water Disputes: కృష్ణా నదిపై ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ మంత్రులు చేస్తున్న కామెంట్లపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రధాన కార్యదర్శి..

AP-Telangana Water Disputes: తెలంగాణ మంత్రుల తీరుపై ఫైర్ అయిన విష్ణువర్ధన్ రెడ్డి.. ప్రాజెక్టులను అడ్డుకోవడం సరికాదంటూ..
Bjp
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 26, 2021 | 1:53 PM

AP-Telangana Water Disputes: కృష్ణా నదిపై ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ మంత్రులు చేస్తున్న కామెంట్లపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాయలసీమ ప్రజలకు సాగు నీరే కాదు.. తాగు నీరు కూడా లేదని స్వయంగా తెలంగాణ సీఎం కేసీఆరే అన్నారని, అలాంటి ప్రాంతానికి నీటినిచ్చే ప్రాజెక్టులను ఇప్పుడు అడ్డుకోవడం కేవలం రాజకీయం కోసమే అని ఫైర్ అయ్యారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి హుజూరాబాద్ ఉపఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఈ కుట్రలో సూత్రధారులు, పాత్రధారులుగా తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఐకమత్యంగా, క్షేమంగా ఉండాలన్నదే బీజేపీ వైఖరి అని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ నిర్మించే ప్రాజెక్టులను అక్రమ ప్రాజెక్టులు అని మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్‌కు, తెలంగాణ మంత్రులకు లేదన్నారు విష్ణువర్ధన్ రెడ్డి. పాలమూరు లిఫ్ట్, డిండి ప్రాజెక్టులు అక్రమంగా నిర్మించలేదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో పాలమూరు జిల్లా కూడా వెనుకబడింది కదా అని ఏపీ నేతలు వీటిపై పెద్దగా మాట్లాడలేదని పేర్కొన్నారు. సమస్యను రెండు రాష్ట్రాల జలవివాదంగా చూడకుండా రాయలసీమ ప్రజల నీటికష్టాలుగా చూడాలని హితవుచెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టులో రాయలసీమ రైతులు భూములు కోల్పోయారని, కానీ ప్రాజెక్టు తెలంగాణకే ఎక్కువ ఉపయోగపడుతోందన్నారు విష్ణువర్ధన్ రెడ్డి.

కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషిస్తూ అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించిందని, కేంద్రమే చొరవ తీసుకుందని ఆయన గుర్తుచేశారు. కృష్ణా జలాల వాటాల విషయంలో వివాదమే లేదన్నారు. ఈ విషయాన్ని ట్రిబ్యూనల్ తీర్పు స్పష్టంగా చెప్పిందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ మంత్రుల తీరుపై ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ మంత్రులు ఉపయోగించే భాష సరిగా లేదని ఆక్షేపించారు. ఉపఎన్నికల్లో బీజేపీని అడ్డుకోవడం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. ఈ డ్రామాలో ఏపీ సీఎం పావుగా మారారన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు.

Also read:

Golden Blood Group: మీకు బాంబే బ్లడ్ గ్రూప్ గురించి తెలుసు.. అత్యంత అరుదైన గోల్డెన్ బ్లడ్ గ్రూప్ గురించి విన్నారా? ఇక్కడ తెలుసుకోండి!

SI sexual Harassment : మైనర్ బాలికపై SI లైంగిక వేధింపులు.. తండ్రిని, అన్నని చంపేస్తానంటూ గన్ తో బెదిరింపులు

Shocking Video: ఒక్క సెకన్ అటు ఇటు అయినా చిరుతకు ఆహారం అయ్యేవాడే!.. షాకింగ్ వీడియో మీకోసం..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!