Andhra Pradesh: ఆ ఊరి ప్రజలపై పగబట్టిన కొండముచ్చులు.. దాడిలో ఒకరు మృతి

| Edited By: Srilakshmi C

Aug 31, 2023 | 2:26 PM

గత మూడేళ్లుగా వినాయక చవితి పండుగా జరుపుకోవటానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. కరోనాతో మొదలైన కష్టాలు ఈ ఏడాది పూర్తిగా తొలిగిపోయినట్లున్నాయి. దీంతో మూడు వారాల ముందే వినాయక చవితి సందడి మొదలైంది. ఈ ఏడాది వర్షాలు కూడా తక్కువుగా ఉన్నాయి. ధీంతో ఇప్పటి నుండే..

Andhra Pradesh: ఆ ఊరి ప్రజలపై పగబట్టిన కొండముచ్చులు.. దాడిలో ఒకరు మృతి
Baboon Monkey
Follow us on

జగ్గయ్యపేట, ఆగస్టు 31: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కొండముచ్చులు దాడులకు తెగబడుతున్నాయి. గత రెండేళ్ల నుంచి జగ్గయ్యపేట స్థానికులపై దాడులు చేస్తూనే ఉన్నాయి. కొండముచ్చుల దాడిలో గాయపడిన బాధితులు ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవడం పరిపాటిగా మారింది. తాజాగా ఎన్టీఆర్ జిల్లా ఇందుగుపల్లికి చెందిన ఓ వ్యక్తి కొండముచ్చుల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి స్థానిక ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు.

కొండముచ్చుల నుంచి తమను కాపాడాలంటూ ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు. సాధారణంగా కొండముచ్చులు డప్పు శబ్దం వింటే వారిపై దాడి చేస్తాయి. డబ్బు కళాకారుడు శ్యామ్యూల్ ముత్యాలమ్మ కార్యక్రమానికి డప్పు కొట్టి ఇంటికి తిరిగి వస్తుండగా.. అతనిపై దాడి చేశాయి. శ్యామ్యూల్ తో పాటు మరో వ్యక్తిపై కూడా దాడికి పాల్పడ్డాయి.

కొండముచ్చుల దాడికి కూడా ఒక కారణం ఉందని తెలుస్తోంది. మూడేళ్ల క్రితం రెండు కొండముచ్చులను ఆ గ్రామానికి తీసుకొచ్చారు కొందరు వ్యక్తులు.. దానిలో ఒక కొండముచ్చు .. ఒక పిల్లకు జన్మనిచ్చింది. ఆ కొండముచ్చు పిల్ల ట్రాక్టర్ కింద పడి చనిపోయింది. దీంతో చనిపోయిన పిల్ల కొండముచ్చు మృతదేహాన్ని డప్పులతో గ్రామంలో ఊరేగించారు. అప్పటి నుంచి గ్రామంలో ఎక్కడ డప్పు శబ్దం వినిపించినా.. కొండముచ్చులు దాడి చేయడం పరిపాటిగా మారింది. కారణాలు ఏవైనా గ్రామస్తులు కొండముచ్చులు ఎక్కడ దాడి చేస్తాయోనని భయాందోళనకు గురవుతున్నారు. తమను కొండముచ్చుల బారి నుంచి కాపాడాలంటూ అధికారులను వేడుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.