Andhra Pradesh: రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన ఏపీ స్పీకర్ తమ్మినేని..

Andhra Pradesh: తెలంగాణలోని రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు రావటం తెలుగువాడిగా...

Andhra Pradesh: రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన ఏపీ స్పీకర్ తమ్మినేని..
Tammineni Sitaram
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 26, 2021 | 3:15 PM

Andhra Pradesh: తెలంగాణలోని రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు రావటం తెలుగువాడిగా ఆనందిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం అన్నారు. సోమవారం నాడు మంగళగిరిలో తమ్మినేని సీతారాం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న పురాతన దేవాలయాల ప్రాధాన్యతని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు రావడం శుభపరిణామం అన్నారు.

మూడు రాజధానుల గురించి ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగిందని, దానిపై ఎలాంటి రాద్ధాంతం అనవసరం అని స్పీకర్ తమ్మినేని సీతారం వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో దిశ అంశంపైనా తమ్మినేని సీతారం స్పందించారు. మహిళలకు రక్షణ కవచంగా ఏర్పాటు చేసిన దిశ చట్టం సమర్థంగా అమలు అవుతుందని చెప్పారు. దిశ యాక్ట్ అమలు కాదనే వారు ఆలోచనా విధానం బలహీనంగా ఉన్నప్పుడు మాత్రమే అలా మాట్లాడుతారని విమర్శించారు.

Also read:

Morning Walk: ఆహ్లాదకర ఆరోగ్యానికి ఉదయపు నడక మంచి మార్గం.. ఈ 9 విషయాలు ఉదయపు నడక ప్రాధాన్యత చెబుతాయి!

Tokyo Olympics 2021: రజత పతకం బంగారమయ్యేనా? మీరాబాయి చానుకి స్వర్ణం అందే ఛాన్స్.. ఎందుకో తెలుసా..!

SC Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌‌న్యూస్.. ప్లాట్‌ఫాం టికెట్ ధరల తగ్గింపు