AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఈ పెన్నుకు మొక్కలు పుడతాయి.. అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఈ పెన్నుతో.. మొక్కలు మొలుస్తాయ్‌.. అదేంటి వింతగా ఉంది అనుకుంటున్నారా. ఇది మంచి కాజ్ కోసమే. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Andhra Pradesh: ఈ పెన్నుకు మొక్కలు పుడతాయి.. అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు
Seeds Pen
Ram Naramaneni
|

Updated on: Jul 30, 2022 | 7:26 PM

Share

Seed pens: మనసుంటే మార్గముటుంది. మంచి పని చేయాలంటే కాస్త మొదడుకు పదును పడితే సరిపోతుంది. అందులో భాగంగానే వచ్చిన ఓ ఎకో ఫ్రెండ్లీ(eco friendly) పెన్ ఇప్పడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఎంత కాస్ట్లీ పెన్ అయినా.. ఇంక్ అయిపోతే పక్కన పడేస్తారు. కాస్త పొదుపు చేసేవారు మాత్రం రిఫిల్స్ మారుస్తూ 2, 3 సార్లు వినియోగిస్తారు. ఆ తర్వాతైనా వాటిని పడేయాల్సిందే. కాగా చాలావరకు పెన్నులను ప్లాస్టిక్‌తోనే తయారుచేస్తారు. దీంతో ఎంతోకొంత మేర పర్యావరణానికి హాని జరుగుతుంది. అందుకు చెక్ పెట్టేందుకు అనంతపురానికి(Anantapur) చెందిన AGS ఓ సరికొత్త ఎకో ఫ్రెండ్లీ పెన్నుతో ముందుకుకొచ్చింది. నగరంలో ప్లాస్టిక్ బ్యాన్ చేసిన నేపథ్యంలో ఈ ట్రస్ట్ వారు స్పెషల్ పెన్స్ గవర్నమెంట్స్ స్కూల్స్‌లో డిస్టిబ్యూట్ చేస్తున్నారు. పేపర్‌తో వీటిని తయారు చేయించారు. ఈ పెన్నుకు ఒక వైపు రాసుకునేందుకు వీలుగా పిన్ ఉంటుంది. మరోవైపు అంటే పెన్ పై భాగంలో నేలలో కలిసిపోయే తత్వం ఉన్న ఓ క్యాప్సుల్ అమర్చారు. అందులో టమాటా, మిరపతో పాటు వంగ విత్తనాలను ఉంచారు. పెన్నులో ఇంక్ అయిపోగానే పడేస్తే.. ఆ పెన్‌ మట్టిలో కలిసిపోయి.. క్యాప్సిల్‌లోని విత్తనాలు వల్ల మొక్కలు మొలుస్తాయి. ప్రజంట్ ఈ పెన్నులను నగరంలో విరివిగా పంపిణీ చేస్తుంది AGS ట్రస్ట్. మనకి ఎంతో ఇచ్చిన నేచర్‌ కోసం.. మనం ఈ మాత్రం చేయలేమా చెప్పండి.

మరిన్ని ఏపీ వార్తలు చదవండి..

రాజధాని అమరావతిలో.. అంగరంగ వైభవంగా తొలిసారి రిపబ్లిక్ వేడుకలు
రాజధాని అమరావతిలో.. అంగరంగ వైభవంగా తొలిసారి రిపబ్లిక్ వేడుకలు
తొక్కే అని తీసిపారేయకండి.. సొరకాయ పొట్టుతో బోలెడు లాభాలు!
తొక్కే అని తీసిపారేయకండి.. సొరకాయ పొట్టుతో బోలెడు లాభాలు!
ఇది బాసూ అన్నయ్య అంటే.. ఈ పాటకు ఆయనే కొరియోగ్రఫీ..
ఇది బాసూ అన్నయ్య అంటే.. ఈ పాటకు ఆయనే కొరియోగ్రఫీ..
ట్రాఫిక్‌ రూల్స్‌ మరింత కఠినం.. 5 దాటితే అంతే సంగతులు..
ట్రాఫిక్‌ రూల్స్‌ మరింత కఠినం.. 5 దాటితే అంతే సంగతులు..
2028 వరకు ప్రభాస్ సినిమా విడుదల కష్టమేనా? 5ఏళ్ల వెయిటింగ్ తప్పదా!
2028 వరకు ప్రభాస్ సినిమా విడుదల కష్టమేనా? 5ఏళ్ల వెయిటింగ్ తప్పదా!
లక్ష్మీ కటాక్షం కోసం కోటీశ్వరులు అనుసరించే వాస్తు రహస్యం తెలుసా..
లక్ష్మీ కటాక్షం కోసం కోటీశ్వరులు అనుసరించే వాస్తు రహస్యం తెలుసా..
ఏడుగురి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ డ్రైవింగ్
ఏడుగురి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ డ్రైవింగ్
ఈ రోజును ఓ వేడుకలా జరుపుకోండి.. యువతకు ప్రధాని మోదీ పిలుపు
ఈ రోజును ఓ వేడుకలా జరుపుకోండి.. యువతకు ప్రధాని మోదీ పిలుపు
అతడిని పిచ్చిగా ప్రేమించా.. కానీ అతడు అమ్మాయిలతో.. హీరోయిన్..
అతడిని పిచ్చిగా ప్రేమించా.. కానీ అతడు అమ్మాయిలతో.. హీరోయిన్..
కేవలం రూ.668కే మోటరోలా 5జి స్మార్ట్ ఫోన్.. షరతులు వర్తిస్తాయ్!
కేవలం రూ.668కే మోటరోలా 5జి స్మార్ట్ ఫోన్.. షరతులు వర్తిస్తాయ్!