AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఇళ్లే వారి టార్గెట్.. ఒకే రోజు రెండు చోరీలు.. వణికిపోతున్న స్థానికులు.. ఎక్కడో తెలుసా?

విజయవాడలోని సత్యనారాయణ పురం పోలీసుల స్టేషన్ పరిధిలో ఒకే రోజు రెండు చోరీలు జరగడం స్థానికులను తీవ్ర భయాదోంళనకు గురిచేస్తోంది. ఇంటి యాజమానులు విదేశాలకు వెళ్లారన్న పక్కా సమాచారంతో రెక్కీ నిర్వహించి అర్థరాత్రి ఇంట్లోకి చొరబడిన దొంగలు ఇంట్లోని బంగారం, నగలు ఎత్తుకెళ్లారు. ఉదయం పనిమనిషి వచ్చి చూడగా ఇంటి తలుపు తెరిచి ఉండడంతో యజమానికి సమాచారం ఇవ్వగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఆ ఇళ్లే వారి టార్గెట్.. ఒకే రోజు రెండు చోరీలు.. వణికిపోతున్న స్థానికులు.. ఎక్కడో తెలుసా?
Ap Crime
Anand T
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Jun 21, 2025 | 2:49 PM

Share

ఈ మధ్య కాలంలో దొంగతనాలు, దొపిడీలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొందరు కేటుగాళ్లు రెక్కీలు నిర్వహించి మరీ ప్లాన్‌ ప్రకారం ఎవరూ లేని సమయంలో ఇళ్లలోకి దూరి అందిన కాడికి దోచుకెల్లిపోతున్నారు. తాగాజా ఇలాంటి ఘటనే సత్యనారాయణపురంలోని లక్ష్మీ నగర్ కాలనీలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. లక్ష్మీ నగర్ కాలనీ LRWA నెంబర్ 370 నివాసం ఉండే K. V. రమాదేవి పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ DE పనిచేసి రిటైర్ అయ్యారు. రమాదేవి కుమార్తె కెనడాలో ఉండటంతో ఆమెను చూసేందుకు.. రమాదేవి ఇటీవల కెనడా వెళ్ళింది. దీంతో అప్పటికే ఇంట్లో దొంకతనం చేసేందుకు ప్లాన్‌ చేసుకున్న కొందరు కేటుగాళ్లు.. దొరికిందే చాన్స్ అనుకొని అర్థరాత్రి ఇంట్లోకి చొరబడి అందిన కాడికి దోసుకెళ్లారు.

అయితే ఉదయం పనిమనిషి వచ్చి చూడగా ఇంటి తాళాలు పగిలిపోయి ఉండడాన్ని గుర్తించింది. వెంటనే యజమాని రమాదేవి బంధువులకు సమాచారం ఇచ్చింది. దీంతో బంధువులు దొంగతనం జరిగిందన్న విషయాన్ని ఫోన్ ద్వారా కెనడాలోని రమాదేవికి చెప్పారు. విషయం తెలుసుకున్న రమావేది అక్కడి నుంచే స్థానిక పోలీసులకు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేసింది. సమాచారంతో ఘటనా స్థానికి చేరుకున్న పోలీసులు ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా బీరు, ఇతర లాకర్లు ఒపెన్‌ చేసి ఉండడాన్ని గమనించారు. అయితే తాను కెనడా వెళ్లే ముందు బీరువాలో రూ.50,000 వేలతో పాటు రెండు ఉంగరాలు పెట్టానని దొంగలు వాటిని ఎత్తుకెళ్లినట్టు రమాదేవి పోలీసుకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

ఇదిలా ఉండగా అదే రోజు రమాదేవి ఇంటికి కొద్ది దూరంలోనే ఉన్న LRWA 359 లో నివాసం ఉంటున్న కోడె కోటేశ్వరరావు ఇంట్లో కూడా దొంగతనం జరిగినట్టు పోలీసులకు సమాచారం అందింది. రాత్రి కోటేశ్వరరావు ఇంట్లోకి చొరబడిన దొంగలు రూ. 10,000 దోచుకెళ్లి నట్టు పోలీసులు గుర్తించారు. ఇక ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. స్థానిక సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు.

మరోవైపు ఎప్పుడూ జనాలతో రద్దీగా ఉండే సత్యనారాయణ పురంలో వరుసగా చోరీలు జరగడంపై స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వీలైనంత త్వరగా ఈ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను పట్టుకొని పోలీసులు తమకు భద్రత కల్పించాలని కోరుతున్నారు స్థానికులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండి..