AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆస్తికోసం సొంత అన్న..అన్న కొడుకు మర్డర్ కు తమ్ముడు స్కెచ్..సుపారి ఎంతో తెలిస్తే..

12 కోట్ల రూపాయలు ఆస్తి తనకే దక్కుతుందని తమ్ముడు దామోదర్ గౌడ్ జంట హత్యలకు కుట్ర చేశాడు. దీంతో అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మెచ్చిరి గ్రామానికి చెందిన టిడిపి నాయకుడు ఆది కేశవులు హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతి రెడ్డిని తమ్ముడు దామోదర్ గౌడ్ సంప్రదించాడు. అన్న... అన్న కొడుకును హత్య చేసేందుకు సుఫారి కుదుర్చుకున్నాడు. హత్య చేసేందుకు 23 లక్షలకు మారుతి రెడ్డితో ఒప్పందం చేసుకున్నాడు. మూడు లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చి...

ఆస్తికోసం సొంత అన్న..అన్న కొడుకు మర్డర్ కు తమ్ముడు స్కెచ్..సుపారి ఎంతో తెలిస్తే..
Police Arrest
Nalluri Naresh
| Edited By: |

Updated on: Mar 07, 2025 | 1:06 PM

Share

సొంత అన్న… అన్న కుమారుడిని హత్య చేసేందుకు తమ్ముడు చేసిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు.. ఆస్తికోసం సొంత అన్నను… అన్న కొడుకుని హత్య చేసేందుకు ఓ తమ్ముడు 23 లక్షల సుపారితో స్కెచ్ వేశాడు.. హత్య చేసేందుకు వెళుతున్న సుపారి ముఠాను పట్టుకున్న పోలీసులకు అసలు విషయం తెలిసింది. అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీసులు…. జంట హత్యల కుట్రను భగ్నం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లా మొలకాల్మూరు తాలూకా కెరెకొండాపుర గ్రామానికి చెందిన మధుసూదన్ గౌడ్… దామోదర్ గౌడ్ అన్నదమ్ములు. ఆస్తులు విషయంలో అన్నదమ్ముల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఆస్తులు గొడవల్లో అన్న… అన్న కొడుకు భార్గవ్… దామోదర్ గౌడ్ ను కొట్టారు. దీంతో ఆస్తికోసం… అవమానభారం తట్టుకోలేక… అన్న మధుసూదన్ గౌడ్… అన్న కొడుకు భార్గవ్ ను కడతేర్చితే 12 కోట్ల రూపాయలు ఆస్తి తనకే దక్కుతుందని తమ్ముడు దామోదర్ గౌడ్ జంట హత్యలకు కుట్ర చేశాడు. దీంతో అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మెచ్చిరి గ్రామానికి చెందిన టిడిపి నాయకుడు ఆది కేశవులు హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతి రెడ్డిని తమ్ముడు దామోదర్ గౌడ్ సంప్రదించాడు. అన్న… అన్న కొడుకును హత్య చేసేందుకు సుఫారి కుదుర్చుకున్నాడు. హత్య చేసేందుకు 23 లక్షలకు మారుతి రెడ్డితో ఒప్పందం చేసుకున్నాడు. మూడు లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చి… అదేవిధంగా మూడు వేటకోడవళ్ళు… ఓ కారు సమకూర్చాడు. ఇక అన్న మధుసూదన్ గౌడ్… అన్న కొడుకు భార్గవ్ను హత్య చేసేందుకు కారులో బయలుదేరిన సుపారి కిల్లర్ మారుతి రెడ్డి, తమ్ముడు దామోదర్ గౌడ్ ను రాయదుర్గం పోలీసులు పల్లెపల్లి వద్ద వాహనాల తనిఖీలు భాగంగా విచారించగా… హత్య కుట్ర వెలుగులోకి వచ్చింది.

నిందితులు కార్లు వేటకుడవళ్ళు తీసుకుని వెళుతుండగా పోలీసులు గుర్తించి తమదైన శైలిలో విచారించగా… సొంత తమ్ముడే.. అన్న, అన్న కొడుకును ఆస్తికోసం సుపారి మర్డర్కు ప్లాన్ చేశాడని పోలీసులు గుర్తించారు. సుఫారి కిల్లర్ మారుతీ రెడ్డి… తమ్ముడు దామోదర్ గౌడ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు… వారి వద్ద నుంచి 3 లక్షల రూపాయల నగదు… మూడు వేట కొడవళ్ళు, కారు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలా ఆస్తికోసం అన్నని హత్య చేయాలనుకున్న తమ్ముడి కుట్రను రాయదుర్గం పోలీసులు భగ్నం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us