AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: అయ్యో దేవుడా.. మార్గ మధ్యలో నిలిచిపోయిన అంబులెన్స్.. పాపం బాలిక..!

పాము కాటుకు గురైన ఓ బాలిక సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయింది.. ఆసుపత్రికి అంబులెన్స్ లో వెళ్తూ ఊపిరి ఆగింది.. సకాలంలో అంబులెన్స్ రాకపోవడం.. వచ్చిన ఫీడర్ అంబులెన్స్ కూడా మార్గమధ్యలోనే బాలికను తీసుకెళ్తూ మరమ్మతులకు గురైంది. దీంతో వైద్యం మరింత ఆలస్యమై ప్రాణాల కోల్పోయింది ఆ బాలిక.

Andhra: అయ్యో దేవుడా.. మార్గ మధ్యలో నిలిచిపోయిన అంబులెన్స్.. పాపం బాలిక..!
108 Ambulance (representative image)
Maqdood Husain Khaja
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Sep 18, 2025 | 11:14 AM

Share

పాము కాటుకు గురైన ఓ బాలిక సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయింది.. ఆసుపత్రికి అంబులెన్స్ లో వెళ్తూ ఊపిరి ఆగింది.. సకాలంలో అంబులెన్స్ రాకపోవడం.. వచ్చిన ఫీడర్ అంబులెన్స్ కూడా మార్గమధ్యలోనే బాలికను తీసుకెళ్తూ మరమ్మతులకు గురైంది. దీంతో వైద్యం మరింత ఆలస్యమై ప్రాణాల కోల్పోయింది ఆ బాలిక.. కళ్ళముందే బాలిక ఊపిరి పోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు.. ఈ విషాద ఘటన అల్లూరి జిల్లా జికే విధి ఏజెన్సీలో ఈ ఘటన జరిగింది.

వివరాల్లోకి వెళితే.. పెదవలస పంచాయితీ గొంతు వలస గ్రామానికి చెందిన మర్రి కవి అనే బాలిక.. ఐదో తరగతి చదువుతోంది. ఇంట్లో నిద్రిస్తోన్న సమయంలో పాము కాటు వేసింది. వెంటనే అంబులెన్స్ కు సమాచారం అందించారు. ఆసుపత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు. ఆంబులెన్స్ అప్పటికే మరో రోగిని తరలించే క్రమంలో ఉండగా రాలేకపోయింది. దీంతో ఫీడర్ అంబులెన్స్ ను సంప్రదించి అందులో బాలికను ఎక్కించి ఆసుపత్రికి తరలిస్తున్నారు. కొంత దూరం వెళ్లిన ఫీడర్ అంబులెన్స్.. మధ్యలో ఆగిపోయింది. ఇక చేసేది లేక ఆమెను టూ వీలర్ పై పెదవలస ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆ బాలిక ప్రాణాలకు కోల్పోయినట్టు వైద్యులు దృవీకరించారు.

సకాలంలో అంబులెన్స్ వచ్చి ఆసుపత్రికి తరలించి ఉంటే బాలిక ప్రాణం దక్కేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమన్వయ లోపం, అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందని.. ఈ ప్రాంతంలో అంబులెన్సుల సంఖ్యను పెంచాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..