AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: బాలుడికి తీవ్రమైన కడుపునొప్పి.. ఆస్పత్రికి తీసుకెళ్లి టెస్టులు చేయగా.. ఎక్స్‌రేలో..

ఆ బాలుడికి తీవ్రమైన కడుపునొప్పి, అస్వస్థత.. డౌట్ వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడున్న డాక్టర్లు ఎక్స్‌రే తీశారు. అందులో వారికీ షాక్ అయ్యేలా.. ఓ వస్తువు కనిపించింది. అదేంటో మరి.. ఈ వార్తలో చూసేద్దాం.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

Andhra: బాలుడికి తీవ్రమైన కడుపునొప్పి.. ఆస్పత్రికి తీసుకెళ్లి టెస్టులు చేయగా.. ఎక్స్‌రేలో..
X Ray
N Narayana Rao
| Edited By: |

Updated on: Sep 18, 2025 | 11:52 AM

Share

ఆరు సెంటీమీటర్ల స్క్రూ డ్రైవర్ డ్రిల్ బిట్ మింగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలుడిని సర్జరీ చేసి ప్రాణాలు కాపాడారు ప్రభుత్వ వైద్యులు. తుమ్మల గౌతమ్ అనే ఎనిమిదేళ్ల బాలుడిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించగా వెంటనే స్పందించిన సూపరిండెంట్ డాక్టర్ రామకృష్ణ సర్జరీ చేసి డ్రిల్ బిట్‌ను బయటికి తీసి బాలుడి ప్రాణాన్ని కాపాడారు. పాఠశాలకు వెళ్లి వచ్చిన అనంతరం ఆటలాడుతూ డ్రిల్ బిట్ మింగి తీవ్రమైన కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యాడు.

దీంతో వెంటనే అతడిని ఏరియా ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. చిన్న బాలుడు కావడంతో.. అనుమానపడ్డ వైద్యులు.. గౌతమ్‌కు ఎక్స్‌రే తీశారు. పెద్ద పేగులో డ్రిల్ బిట్ అడ్డంగా ఇరుక్కుపోయి ఉన్నట్టు అందులో గుర్తించారు. తీవ్ర నొప్పితో బాధపడుతున్న బాలుడిని గమనించిన సూపరిండెంట్ డాక్టర్ రామకృష్ణ వెంటనే మూడు గంటలపాటు శ్రమించి సర్జరీ చేసి ఆరు సెంటీమీటర్ల డ్రిల్ బిట్‌ను బయటికి తీయడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. సర్జరీ అనంతరం బాలుడిని ఐసియూలో మెరుగైన వైద్యం అందిస్తూ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు వైద్యులు.

Follow Us
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్