AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambati Khashvi: పిట్ట కొంచెం.. కూత ఘనం.. 17 నెలల చిన్నారి ట్యాలెంట్‌ చూస్తే మతిపోవాల్సిందే!

పిట్ట కొంచెం..కూత ఘనం అన్నట్టు ఒంగోలు పట్టణంలోని సత్యనారాయపురంకి చెందిన 17 నెలల చిన్నారి అంబటి ఖశ్వి ఏకంగా ప్రపంచ రికార్డు సాధించింది. కేవలం 17 నెలలు వయస్సులోనే 24 వేర్వేరు కేటగిరీలలో 650కి పైగా ఇంగ్లీష్ పదాలను మాట్లాడి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది.

Ambati Khashvi: పిట్ట కొంచెం.. కూత ఘనం.. 17 నెలల చిన్నారి ట్యాలెంట్‌ చూస్తే మతిపోవాల్సిందే!
Ambati Khashvi
Fairoz Baig
| Edited By: Anand T|

Updated on: Jul 08, 2025 | 10:03 PM

Share

ఒంగోలు పట్టణంలోని సత్యనారాయపురంకి చెందిన 17 నెలల వయస్సున్న అంబటి ఖశ్వి ప్రపంచ రికార్డు సాధించింది. కేవలం 17 నెలలు వయస్సులోనే 24 వేర్వేరు కేటగిరీలలో 650కి పైగా ఇంగ్లీష్ పదాలను మాట్లాడగలగడం ద్వారా “నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్” లో స్థానం దక్కించుకుంది అంబటి ఖశ్వి. ఇది చిన్నారుల విభాగంలో ప్రపంచస్థాయిలో అత్యుత్తమ రికార్డుగా గుర్తింపు పొందింది. గతంలో ఉన్న రికార్డును నాలుగు సంవత్సరాల మూడు నెలల చిన్నారి 300 పదాలు మాట్లాడిన ఘనతను అంబటి ఖస్వీ అధిగమించడం విశేషం. ఈ సందర్బంగా ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ దామోదర్ చిన్నారి అంబటి ఖశ్వి ని ప్రత్యేకంగా అభినందించారు.

అంబటి ఖశ్వి ప్రపంచవ్యాప్తంగా ఒక అరుదైన ఘనతను సాధించిందని, కేవలం జిల్లాకే కాకుండా రాష్ట్రానికి కూడా గర్వకారణమని ప్రకాశంజిల్లా ఎస్‌పి దామోదర్‌ తెలిపారు. చిన్న వయస్సులోనే ఇటువంటి మేధస్సు ప్రదర్శించడం అద్భుతమైన విషయమన్నారు. చిన్నారుల్లో తెలివితేటలు, ప్రతిభను గుర్తించాలన్నారు. ఈ విజయం సాధించడంలో కుటుంబ సభ్యుల సహకారం, మార్గదర్శకత ఎంతో ముఖ్యమైందని తల్లిదండ్రులను అభినందించారు. జిల్లా పోలీస్ శాఖ తరఫున అంబటి ఖశ్వి భవిష్యత్తు మరింత వెలుగులు విరచిమ్మాలని జిల్లా ఎస్పీ దామోదర్‌ ఆకాంక్షించారు… ఈ కార్యక్రమంలో చిన్నారి తల్లిదండ్రులు సాయికుమార్, ప్రణతి, తాతయ్య ,నానమ్మలు శివాజీ గణేష్, కోటేశ్వరమ్మ పాల్గొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పవన్ కల్యాణ్ పక్కన చేసినా లక్‌ దక్కని ఐదుగురు హీరోయిన్లు!
పవన్ కల్యాణ్ పక్కన చేసినా లక్‌ దక్కని ఐదుగురు హీరోయిన్లు!
1 లక్ష రూపాయలు 6 కోట్లు అయ్యింది.. ధనవంతులను చేసిన స్టాక్‌!
1 లక్ష రూపాయలు 6 కోట్లు అయ్యింది.. ధనవంతులను చేసిన స్టాక్‌!
భారీగా ఎగిసిపడిన మంటలు .. 10 పడవలు దగ్ధం.. అసలు ఏం జరిగిందంటే..?
భారీగా ఎగిసిపడిన మంటలు .. 10 పడవలు దగ్ధం.. అసలు ఏం జరిగిందంటే..?
90 సినిమాల్లో నటించిన హీరోయిన్​.. పెళ్లికి మాత్రం నో!
90 సినిమాల్లో నటించిన హీరోయిన్​.. పెళ్లికి మాత్రం నో!
ఇదెక్కడి దారుణం.. చికెన్ ముక్క ఇరుక్కొని ఆటో డ్రైవర్ మృతి
ఇదెక్కడి దారుణం.. చికెన్ ముక్క ఇరుక్కొని ఆటో డ్రైవర్ మృతి
కల్కి2లో దీపిక స్థానంలో స్టార్ హీరోయిన్.. ఎంతవరకు సాధ్యం?
కల్కి2లో దీపిక స్థానంలో స్టార్ హీరోయిన్.. ఎంతవరకు సాధ్యం?
ప్రభాస్​ సినిమా ప్లాప్​ అవడానికి ఆ హీరోనే కారణమా?
ప్రభాస్​ సినిమా ప్లాప్​ అవడానికి ఆ హీరోనే కారణమా?
గంభీర్‌ను చూసి ఎక్స్‌ప్రెషన్ మార్చేసిన కోహ్లీ..అసలు ఏం జరుగుతోంది
గంభీర్‌ను చూసి ఎక్స్‌ప్రెషన్ మార్చేసిన కోహ్లీ..అసలు ఏం జరుగుతోంది
రాత్రి వేళల్లో తినకూడని ఫ్రూట్స్ ఇవే!
రాత్రి వేళల్లో తినకూడని ఫ్రూట్స్ ఇవే!
యోగాతో గుండెపోటుకు చెక్.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన అద్భుత ఆసనాలు
యోగాతో గుండెపోటుకు చెక్.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన అద్భుత ఆసనాలు