గ్రామ వాలంటీర్లూ.. ఇక మీదే జోరు.. ఎమ్మెల్యే రోజా..
వైసీపీ ఎమ్మెల్యే రోజా చిత్తూరు జిల్లాలో పర్యటించారు. వడమాల పేట మండలంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కుంభాభిషేక మహోత్సవంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం నగరిలో కణంమిట్ట కాళికా దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. నగరి రూరల్ అడవి కొత్తూరు పంచాయతీ గొల్ల కండ్రిగలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతాకావిష్కరణ చేశారు. తరువాత వడమాలపేట మండలంలో గ్రామ వాలంటీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల శిక్షణా కార్యక్రమంలో రోజా పాల్గొన్నారు. అనంతరం వారికి […]
వైసీపీ ఎమ్మెల్యే రోజా చిత్తూరు జిల్లాలో పర్యటించారు. వడమాల పేట మండలంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కుంభాభిషేక మహోత్సవంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం నగరిలో కణంమిట్ట కాళికా దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. నగరి రూరల్ అడవి కొత్తూరు పంచాయతీ గొల్ల కండ్రిగలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతాకావిష్కరణ చేశారు. తరువాత వడమాలపేట మండలంలో గ్రామ వాలంటీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల శిక్షణా కార్యక్రమంలో రోజా పాల్గొన్నారు. అనంతరం వారికి వాలంటీర్లుగా నియామక పత్రాలు అందజేశారు. చిత్తూరు జిల్లాలో పర్యటిస్తూ.. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పొల్గొంటూ రోజంతా బిజీ బిజీగా గడిపారు.