జనసేన కార్యకర్త మృతితో.. కంటతడి పెట్టిన పవన్ కళ్యాణ్..
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. గత కొద్ది రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతూ.. ఇటీవలే చనిపోయిన జనసేన కార్యకర్త మురళి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. మురళి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మురళి స్థానంలో తాను కుటుంబానికి అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. 2.50 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని చెక్ రూపంలో వారికి అందజేశారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు చనిపోవడం బాధ కలిగిస్తోందన్నారు జనసేనాని. మురళి […]
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. గత కొద్ది రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతూ.. ఇటీవలే చనిపోయిన జనసేన కార్యకర్త మురళి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. మురళి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మురళి స్థానంలో తాను కుటుంబానికి అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. 2.50 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని చెక్ రూపంలో వారికి అందజేశారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు చనిపోవడం బాధ కలిగిస్తోందన్నారు జనసేనాని. మురళి చనిపోయాడన్న వార్త తనను కదలించిందన్నారు. డబ్బుతో ప్రాణాలకు వెలకట్టలేమని.. వారి కుటుంబానికి తన వంతు సాయం చేశామని పవన్ చెప్పారు. అతడి బిడ్డల భవిష్యత్ జనసేన పార్టీ చూసుకుంటుందన్నారు.