ఇది చారిత్రక ఘట్టం.. : నిర్మలాసీతారామన్
ఆర్టికల్ 370 రద్దు పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ స్పందించారు. ఈ వ్యవహారంలో ప్రతిపక్షాల తీరును ఆమె తప్పుబట్టారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ తీసుకున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పై లోక్‌సభలో చర్చ జరిగింది. జనసంఘ్ కాలం నుంచి ఇదే విషయం పదే పదే ప్రస్తావిస్తున్నామని నిర్మలా సీతారామన్ గుర్తుచేశారు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టోలో కూడా ఈ విషయం స్పష్టంగా ఉందన్నారు. అందరి అభిప్రాయాలు పరిగణనలోకి […]
ఆర్టికల్ 370 రద్దు పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ స్పందించారు. ఈ వ్యవహారంలో ప్రతిపక్షాల తీరును ఆమె తప్పుబట్టారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ తీసుకున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పై లోక్‌సభలో చర్చ జరిగింది. జనసంఘ్ కాలం నుంచి ఇదే విషయం పదే పదే ప్రస్తావిస్తున్నామని నిర్మలా సీతారామన్ గుర్తుచేశారు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టోలో కూడా ఈ విషయం స్పష్టంగా ఉందన్నారు. అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకున్నాకే.. కశ్మీర్ అంశంలో నిర్ణయం తీసుకోవాలన్నది బీజేపీ మూల సిద్ధాంతం అని చెప్పారు. ఇది ఒక చారిత్రక ఘట్టం అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.