‘‘ఇచ్చిన మాట ప్రకారం’’.. జగన్ ట్వీట్

అధికారంలోకి రాగానే మూడు దశల్లో మద్యపాన నిషేధాన్ని చేస్తానని ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకేశారు. మద్యం అమ్మకాల బాధ్యతను ప్రభుత్వానికే అప్పగించేలా ఆయన ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘‘మద్యంతో మానవ సంబంధాలు నాశనమైపోతున్నాయని, అక్కచెల్లెమ్మల కన్నీళ్లు తుడుస్తానని మాట ఇచ్చాను. నిషేధం దిశగా అడుగులేస్తూ బెల్టుషాపుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. మద్యం అమ్మకాల బాధ్యతను ప్రభుత్వానికే అప్పగిస్తూ […]

‘‘ఇచ్చిన మాట ప్రకారం’’.. జగన్ ట్వీట్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: Jul 25, 2019 | 7:35 PM

అధికారంలోకి రాగానే మూడు దశల్లో మద్యపాన నిషేధాన్ని చేస్తానని ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకేశారు. మద్యం అమ్మకాల బాధ్యతను ప్రభుత్వానికే అప్పగించేలా ఆయన ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు.

‘‘మద్యంతో మానవ సంబంధాలు నాశనమైపోతున్నాయని, అక్కచెల్లెమ్మల కన్నీళ్లు తుడుస్తానని మాట ఇచ్చాను. నిషేధం దిశగా అడుగులేస్తూ బెల్టుషాపుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. మద్యం అమ్మకాల బాధ్యతను ప్రభుత్వానికే అప్పగిస్తూ చట్టాన్ని తెచ్చాం. తద్వారా గ్రామాల్లో బెల్టుషాపులు పూర్తిగా మూతపడతాయి’’ అని జగన్ ట్వీట్ చేశారు.