ఏపీలో సీబీఐ ఎంట్రీకి సీఎం గ్రీన్‌సిగ్నల్
ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. గత ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని చట్టాలను సవరించనున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోకి సీబీఐ అనుమతికి సమ్మతిస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. అయితే కేంద్ర హోంశాఖ ఆద్వర్యంలో పనిచేసే సీబీఐ.. దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. అయితే ఇందుకోసం ఆయా రాష్ట్రాలు తమ సమ్మతిని ఇవ్వాల్సి ఉంటుంది. అయితే సీబీఐని కేంద్రం రాజకీయ వేధింపులకు ఓ ఆయుధంగా వాడుకుంటోందన్న ఆరోపణల […]
ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. గత ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని చట్టాలను సవరించనున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోకి సీబీఐ అనుమతికి సమ్మతిస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. అయితే కేంద్ర హోంశాఖ ఆద్వర్యంలో పనిచేసే సీబీఐ.. దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. అయితే ఇందుకోసం ఆయా రాష్ట్రాలు తమ సమ్మతిని ఇవ్వాల్సి ఉంటుంది. అయితే సీబీఐని కేంద్రం రాజకీయ వేధింపులకు ఓ ఆయుధంగా వాడుకుంటోందన్న ఆరోపణల నేపథ్యంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సీబీఐ సమ్మతి ఉత్తర్వులను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకుంది. అభియోగాలు, కుమ్ములాటల నేపథ్యంలోనే సీబీఐకి ఇచ్చిన సమ్మతి ఉత్తర్వులను రద్దు చేశామని అప్పటి ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పుకొచ్చారు. తాజాగా ఏపీలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడంతో ఆ చట్టాన్ని సవరించబోతోంది.