కోడెల ఆత్మహత్య కేసు.. ఇంకా అందని పోస్టుమార్టం రిపోర్ట్.?
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసులో తాజాగా బిగ్ ట్విస్ట్ ఒకటి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత సెప్టెంబర్ 16న హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తన నివాసంలో కోడెల మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మృతికి సంబంధించిన పోస్టుమార్టం రిపోర్ట్ ఇప్పటివరకు తనకు అందలేదని బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు వెల్లడించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. సెప్టెంబర్ 16న బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 7లోని తన ఇంట్లో కోడెల సుమారు […]

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసులో తాజాగా బిగ్ ట్విస్ట్ ఒకటి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత సెప్టెంబర్ 16న హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తన నివాసంలో కోడెల మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మృతికి సంబంధించిన పోస్టుమార్టం రిపోర్ట్ ఇప్పటివరకు తనకు అందలేదని బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు వెల్లడించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది.
సెప్టెంబర్ 16న బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 7లోని తన ఇంట్లో కోడెల సుమారు ఉదయం 11 గంటల సమయంలో నైలాన్ తాడుకు వేలాడుతూ ఉండగా.. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ఆయనకు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది.. సుమారు మధ్యాహ్నం 12.39కి కోడెల చివరి శ్వాస విడిచారని అధికారికంగా వెల్లడించారు.
వైసీపీ వేధింపుల వల్లే ఆయన మరణించారంటూ టీడీపీ నేతలు ఆరోపించడంతో ఆయన మరణం రాజకీయంగా తీవ్ర వివాదాస్పదమైంది. దీంతో పోలీసులు కూతురు, భార్య, గన్‌మాన్‌ల వాంగ్మూలం నమోదు చేసి కేసు దర్యాప్తు చేశారు. ఇక ఈ నేపథ్యంలో కోడెల ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఘటనాస్థలంలో వారికి కేబుల్ వైర్ లభించింది. దీంతో పోలీసులు ఆయన కుటుంబసభ్యులను విచారించడమే కాకుండా కోడెల సెల్‌ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక ఘటన జరిగిన రోజు క్లూస్ టీమ్ సేకరించిన కొన్ని ఆధారాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు మాత్రం దానికి సంబంధించిన రిపోర్ట్ యంత్రం తమకు అందలేదని ఏసీపీ కేఎస్ రావు వెల్లడించారు. మూడు నెలలు గడుస్తున్నా.. పోస్టుమార్టం నివేదిక అందకపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.




