”స్ధానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్దమే”

ఏపీ ప్రభుత్వంపై కోర్టులకు వెళ్లి, టీడీపీ నేతలను హోటళ్లలో కలుస్తున్న రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ ప్రసాద్‌పై విశ్వాసం లేకే తాము ఎస్ఈసీ నిర్వహించిన సమావేశానికి..

''స్ధానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్దమే''
Follow us

|

Updated on: Oct 28, 2020 | 10:07 PM

Local Body Elections: ఏపీ ప్రభుత్వంపై కోర్టులకు వెళ్లి, టీడీపీ నేతలను హోటళ్లలో కలుస్తున్న రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ ప్రసాద్‌పై విశ్వాసం లేకే తాము ఎస్ఈసీ నిర్వహించిన సమావేశానికి వెళ్లలేదని రాష్ట్ర మున్సిపల్ శాఖ మ౦త్రి బొత్స సత్యన్నారాయణ వెల్లడించారు. పార్టీ విధానం, ప్రభుత్వ విధానం ఒక్కటే అని తెలిపిన మంత్రి.. ఎస్ఈసీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి వెళ్లకూడదని నిర్ణయించామని తెలిపారు.

స్ధానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీ సిద్దమేనని…నూటికి నూరుశాతం తమదే గెలుపు అని మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్త౦ చేశారు. రాష్ట్రంలో ఇంకా కోవిడ్ తీవ్రత ఉన్నందువల్లే ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిపారు. ఓ వ్యక్తి నిర్ణయం వల్ల రాష్ట్రానికి రూ. 3,200 కోట్లు నష్టం వచ్చి౦దని.. అప్పుడు రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడలేదని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా నాడు ఎన్నికలు ఎలా రద్దు చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ అడిగారు.

Also Read:

ముంబై ఇండియన్స్‌కు షాక్.. టోర్నీ వీడనున్న హిట్‌మ్యాన్.!

మధ్యాహ్న భోజన పధకంలో మార్పులు.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంకు కొలువుల జాతర..

భక్తులకు శుభవార్త.. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల..

రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై తాజా హెల్త్ బులిటెన్..