ఏపీ పోలీస్ దేశంలోనే నెంబర్ 1.. ఎందులోనంటే..?

నేర పరిశోధనతోపాటు పలు విధాలుగా ఆధునిక టెక్నాలజీని వినియోగించుకోవడంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు నెంబర్ అని నిరూపించుకున్నారు. తాజాగా జాతీయ స్థాయిలో పోలీసు శాఖలో...

ఏపీ పోలీస్ దేశంలోనే నెంబర్ 1.. ఎందులోనంటే..?
Follow us

|

Updated on: Oct 28, 2020 | 4:57 PM

AP Police number one in the country:  నేర పరిశోధనతోపాటు పలు విధాలుగా ఆధునిక టెక్నాలజీని వినియోగించుకోవడంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు నెంబర్ అని నిరూపించుకున్నారు. తాజాగా జాతీయ స్థాయిలో పోలీసు శాఖలో టెక్నాలజీ వినియోగానికి అవార్డులివ్వగా.. అందులో సగానికి పైగా అవార్డులను ఏపీ పోలీసు శాఖ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో పోలీసు శాఖను అభినందించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

వివిధ రాష్ట్రాల పోలీస్ విభాగాలలో ఆధునిక టెక్నాలజీ వినియోగంలో మొత్తం 84 అవార్డులను ప్రకటించారు. అందులో సగానికిపైగా.. అంటే రికార్డు స్థాయిలో 48 అవార్డులను ఏపీ పోలీసు విభాగం దక్కించుకుంది. ఏపీ పోలీసు శాఖకు 48 అవార్డులు రాగా.. తెలంగాణ పోలీసులకు ఒకే ఒక్క అవార్డు రావడం విశేషం. కేరళ పోలీసులకు 9, మహారాష్ట్ర, బెంగాల్ పోలీసులకు నాలుగేసి చొప్పున అవార్డులు దక్కాయి. టెక్నాలజీ విషయంలో ఈ ఏడాది ఇప్పటికే 37 అవార్డులను ఏపీ పోలీసులు సాధించారు. తాజాగా ప్రకటించిన 48 అవార్డులతో కలిపి ఏపీ పోలీసులకు వచ్చిన అవార్డుల సంఖ్య 85కు పెరిగింది.

మహిళల రక్షణ కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన దిశ, దానికి సంబంధించిన విభాగంలో అందిస్తున్న టెక్నాలజీ సేవలకుగాను 5 అవార్డులను సొంతం చేసుకుంది. ఇటీవల ప్రజల కోసం 87 సేవలతో అందుబాటులోకి తీసుకొని వచ్చిన ఏపీ పోలీస్ సేవ అప్లికేషన్ కూడా అవార్డును దక్కించుకుంది. పోలీస్ శాఖ సిబ్బందికి కోవిడ్ సమయంలో అందించిన, అందిస్తున్న మెరుగైన సంక్షేమానికిగాను మరో మూడు అవార్డులు దక్కాయి. టెక్నికల్ విభాగంలో 13 అవార్డులు, సీఐడీ- 4, కమ్యూనికేషన్-3, విజయవాడ, కర్నూల్ జిల్లాలకు -3, ప్రకాశం, విజయనగరం, అనంతపురం, కడప జిల్లాలకు-2, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు,గుంటూరు(అర్బన్), గుంటూరు(రూరల్), కృష్ణ జిల్లాలకు- 1 అవార్డు దక్కాయి.

టెక్నాలజీ వినియోగంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారీతనంతో , త్వరతగతిన సేవలందించే దిశగా అడుగులు వేస్తున్నామని ఏపీ డీజీపీ గౌతమ్ సావంగ్ హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో అవార్డులను దక్కించుకున్న విజేతలందరిని అభినందిస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పోలీస్ శాఖకు ఇస్తున్న ప్రాముఖ్యతతోనే సత్ఫలితాలు సాధిస్తున్నామని ఆయనన్నారు.

Also read: రైతు భరోసా కేంద్రాలపై గురుతర బాధ్యత.. జగన్ సంచలన నిర్ణయం

Also read: ఇళ్ళను ఆక్రమించుకుంటాం… టీడీపీ నేతల హెచ్చరిక

Also read: కొత్త సచివాలయ నిర్మాణానికి ‘సుప్రీం‘ ఓకే

Also read: పోతుల సునీత షాకింగ్ డెసిషన్

Also read: సొంత సీఎం కేండిడేట్‌పై మోదీ సెటైర్లు