AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ సీఎంకు ఉండవల్లి ఉచిత సలహా

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఉచిత సలహా ఒకటి ఇచ్చారు. ముప్పై ఏళ్ళ పాటు రాష్ట్రాన్ని పాలిస్తానంటున్న జగన్.. తన సలహా పాటించకపోతే ఎలా అంటూ విస్మయం వ్యక్తం చేశారాయన.

ఏపీ సీఎంకు ఉండవల్లి ఉచిత సలహా
Rajesh Sharma
|

Updated on: Oct 29, 2020 | 5:23 PM

Share

Undavalli suggestion to CM Jagan: కేంద్రంపై పోరాడాలంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సలహా ఇస్తున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. కేంద్రానికి భయపడతే ఏపీకి భవిష్యత్తు వుండదని ఆయనంటున్నారు.

గురువారం మీడియాతో మాట్లాడిన ఉండవల్లి… కేసీఆర్ సహా పలువురు ముఖ్యమంత్రులు ధైర్యంగా కేంద్రాన్ని నిలదీస్తూ.. ప్రధాని మోదీతో అమీతుమీకి సిద్డపడుతుంటే.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీరు అందుకు భిన్నంగా వుందని ఆరోపించారు.

కారణాలేవైనా ముఖ్యమంత్రి జగన్ బీజేపీ నేతలకు, కేంద్ర ప్రభుత్వ అధినేతలకు భయపడ కూడదన్నది ఉండవల్లి అభిప్రాయం. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీలేకుండా వ్యవహరించాలని ఆయన ముఖ్యమంత్రికి సూచించారు.

కేంద్రంలో పాలనలో వున్న బీజేపీ నేతలు ఏపీకి అన్యాయం చేస్తున్నారని, ముఖ్యమంత్రి గట్టిగా లేకపోతే వారు ఏపీకి ఇంకా అన్యాయం చేస్తారని ఉండవల్లి అంటున్నారు. గట్టిగా నిలబడితే.. ముప్పై ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిగా కొనసాగే సత్తా జగన్ మోహన్ రెడ్డికి వుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Also read:  చెరుకు రైతులకు మోదీ కేబినెట్ శుభవార్త

Also read: అతి చేయొద్దు సూర్యా.. రవిశాస్త్రి వార్నింగ్

Also read: నవంబర్ 2 నుంచి ఏపీ స్కూళ్ళు రీఓపెన్… కండీషన్స్ ఇవే