వీఆర్‌వో పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్

రెవెన్యూ శాఖలో 3,795 గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్‌వో) గ్రేడ్‌ -2 పోస్టుల భర్తీకి లైన్‌ క్లియర్‌ అయింది. ఇప్పటికే పలు నోటిఫికేషన్ల ద్వారా సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో వేల సంఖ్యలో వీఆర్‌వో పోస్టుల్ని భర్తీ చేసింది ప్రభుత్వం.

వీఆర్‌వో పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్
AP Government Cancels Six Thousand Houses
Follow us

|

Updated on: Jun 05, 2020 | 4:03 PM

రెవెన్యూ శాఖలో 3,795 గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్‌వో) గ్రేడ్‌ -2 పోస్టుల భర్తీకి లైన్‌ క్లియర్‌ అయింది. ఇప్పటికే పలు నోటిఫికేషన్ల ద్వారా సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో వేల సంఖ్యలో వీఆర్‌వో పోస్టుల్ని భర్తీ చేసింది ఏపీ ప్రభుత్వం. అయితే, చాలా ఏళ్లుగా వీఆర్‌ఏలుగా పనిచేస్తున్నవారికి వీఆర్‌వో పోస్టుల్ని ఇవ్వాలని పలు ఉద్యోగ సంఘాలు ఏపీ ప్రభుత్వాన్ని కోరాయి. దీనిపై సానుకూలంగా స్పందించిన ఏపీ సర్కార్ 3,795 వీఆర్‌ఓ పోస్టుల్ని ప్రకటించింది. ఈ పోస్టులు వీఆర్‌ఏలకు మాత్రమే. ఇంటర్మీడియట్ తత్సమాన విద్యార్హతలు ఉన్న వీఆర్‌ఏలను మాత్రమే ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. సీనియారిటీ ప్రాతిపదికన ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ పోస్టుల్ని భర్తీ చేసే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించింది ఏపీ ప్రభుత్వం.

మొత్తం వీఆర్‌వో పోస్టులు: 3,795 (వీఆర్‌ఏలకు మాత్రమే)

విద్యార్హత: ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సు పాస్ కావాలి. ఇంటర్ చదవకుండా డిస్టెన్స్‌లో డిగ్రీ, పీజీ పూర్తి చేసినవారు కూడా అర్హులే. ఇతర అర్హతలు: 2020 జనవరి 1 నాటికి వీఆర్‌ఏగా ఐదేళ్ల సర్వీస్ పూర్తి కావాలి

ఎంపిక విధానం: సీనియారిటీ, సర్టిఫికెట్ వెరిఫికేషన్