మహిళలకు జగన్ ప్రభుత్వం మరో తీపి కబురు..!

రాష్ట్రంలోని పొదుపు సంఘాల మహిళలకు ఏపీ ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. ఇప్పటికే వారికి YSR సున్నా వడ్డీ పథకంతో ప్రభుత్వం చేయూత ఇస్తుండగా..

మహిళలకు జగన్ ప్రభుత్వం మరో తీపి కబురు..!
Follow us

| Edited By:

Updated on: Jun 05, 2020 | 10:17 PM

రాష్ట్రంలోని పొదుపు సంఘాల మహిళలకు ఏపీ ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. ఇప్పటికే వారికి YSR సున్నా వడ్డీ పథకంతో ప్రభుత్వం చేయూత ఇస్తుండగా.. తాజాగా బ్యాంక్ వడ్డీరేట్లపై ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. మహిళలకు తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు ఇచ్చేందుకు పలు బ్యాంకులు ముందుకు వచ్చాయి. దీంతో రాష్ట్రంలోని 93 లక్షల మంది పొదుపు సంఘాల మహిళలకు ఏటా రూ.283కోట్ల లబ్ధి చేకూరనుంది. అలాగే ప్రభుత్వంపై రూ.150.14 కోట్ల వడ్డీ భారం తగ్గనుంది.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలను రాష్ట్ర గ్రామీణాభివృద్ది, పంచాయతీరాజ్‌ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో పొదుపు సంఘాలు బ్యాంకులు ఇస్తున్న వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటంతో.. చెల్లింపు విషయంలో మహిళలకు భారంగా మారిందని ఆయన అన్నారు. దీనిపై దృష్టి సారించిన సీఎం, బ్యాంకర్లతో చర్చించినట్లు పెద్దిరెడ్డి వివరించారు.

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా పొదుపు సంఘాల రుణాలపై 12.50 శాతం వడ్డీరేటు వసూలు చేయగా.. ప్రస్తుతం 9.25 శాతానికి తగ్గిందని మంత్రి అన్నారు. అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వడ్డీ రేటు 12.50శాతం ఉండగా.. ప్రస్తుతం 8.10 నుంచి 9.60శాతం వసూలు చేయనుందని వివరించారు. అలాగే ఆప్కాబ్ కూడా 12.50 శాతం నుంచి 10శాతానికి.. సిండికేట్ బ్యాంక్ తో విలీనమైన కెనరా బ్యాంక్ 9.15 నుంచి 9.40 వరకు వడ్డీ రేట్లను తగ్గించినట్లు మంత్రి పేర్కొన్నారు.

Read This Story Also: కరోనా పాజిటివ్ మహిళపై విచారణకు ఆదేశించిన సీఎం.. ఎందుకంటే!