విశాఖ‌లో లీకైన్ గ్యాస్ అత్యంత ప్ర‌మాద‌కారి..ప‌చ్చ‌ని చెట్లు కూడా..

విశాఖ‌లో లీకైన్ గ్యాస్ అత్యంత ప్ర‌మాద‌కారి..ప‌చ్చ‌ని చెట్లు కూడా..

విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి లీకైన గ్యాస్ కారణంగా కనిపిస్తున్న పరిస్థితి భోపాల్ దుర్ఘటనకు మించిన విషాద‌క‌రంగా ఉంది.

Jyothi Gadda

|

May 07, 2020 | 12:05 PM

విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి లీకైన గ్యాస్ కారణంగా కనిపిస్తున్న పరిస్థితి భోపాల్ దుర్ఘటనకు మించిన విషాద‌క‌రంగా ఉంది. ఈ గ్యాస్ లీకేజీ కారణంగా ఐదు గ్రామాలలో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. గ్యాస్ ప్రభావంతో ఆ పరిసర ప్రాంతాలలోని చెట్లు రంగుమారాయి. ఇక ఐదు గ్రామాల్లో కలిసి దాదాపు 50 వేల మందికి పైనే ఉంటారు. రెండున్నర వేల మంది వరకూ విషవాయువు కారణంగా అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిలో చిన్నారులు, వృద్ధులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.  వందల మంది తీవ్ర అస్వస్థతకు గురై వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. ఈ గ్యాస్ ప్రభావం మనుషులపై నే కాకుండా  పశువులు, ప‌క్షుల‌పై కూడా ఉంది. ఇదిలా ఉంటే ప్ర‌మాదంలో మృతిచెందిన వారి సంఖ్య 10కి పెరిగిన‌ట్లుగా తెలుస్తోంది.

విశాఖ‌లో లీకైన గ్యాస్ చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన‌ద‌ని కేజీహెచ్ వైద్యులు తెలిపారు. గ్యాస్ పీల్చ‌గానే వెంట‌నే మెద‌డుపై ప్ర‌భావం చూప‌డంతో ప్ర‌జ‌లు అప‌స్మార‌క స్థితికి చేరుకున్నారు. గ్యాస్ పీల్చిన‌వారికి న‌రాల‌పై తీవ్ర ప్ర‌భావం ఉంటుంది. త‌ల‌నొప్పి, వాంతులు, వినికిడి లోపం, తీవ్రమైన మాన‌సిక ఇబ్బందుల‌కు గుర‌య్యే అవ‌కావం ఉంద‌ని వైద్యులు తెలిపారు. లీకైన గ్యాస్ ప్ర‌భావానికి చెట్ల‌న్నీ మాడిపోయాయి. ఈ విష‌వాయువు పీల్చిన మూగ‌జీవాలు కూడా నుర‌గ‌లు క‌క్కుతూ నేల‌కొరిగాయి. గ్యాస్ ప్రభావం పడిన గ్రామాలలో అనేక పశువులు మృత్యువాత పడ్డాయి.  ఇక గ్యాస్ లీక్ కారణంగా ప్రభావితమైన ఐదు గ్రామాలలో పచ్చని చెట్ల రంగు మారింది. దీంతో జనం మరింత ఆందోళన చెందుతున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu