జగన్‌తోనే నా ప్రయాణం: వల్లభనేని వంశీ
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. ఏపీ ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దాదాపు 20 రోజుల క్రితమే ఆయన టీడీపీకి రాజీనామా చేశారు. అంతకముందు ఆయన బీజేపీ నేత సుజనా చౌదరి, సీఎం జగన్‌లతో విడివిడిగా భేటీ అయ్యారు. అన్నీ రాజకీయ, సామాజిక పరిస్థితులను బేరీజు వేసుకున్న వంశీ…వైసీపీలో చేరడానికే మొగ్గు చూపారు. కానీ ఇన్నిరోజులు సైలెన్స్‌ని మెయింటేన్ చేస్తూ వస్తుండటంతో గన్నవరం ఎమ్మెల్యే పొలిటికల్ జర్నీపై సస్పెన్స్ నెలకుంది. కాగా నేడు […]
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. ఏపీ ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దాదాపు 20 రోజుల క్రితమే ఆయన టీడీపీకి రాజీనామా చేశారు. అంతకముందు ఆయన బీజేపీ నేత సుజనా చౌదరి, సీఎం జగన్‌లతో విడివిడిగా భేటీ అయ్యారు. అన్నీ రాజకీయ, సామాజిక పరిస్థితులను బేరీజు వేసుకున్న వంశీ…వైసీపీలో చేరడానికే మొగ్గు చూపారు. కానీ ఇన్నిరోజులు సైలెన్స్‌ని మెయింటేన్ చేస్తూ వస్తుండటంతో గన్నవరం ఎమ్మెల్యే పొలిటికల్ జర్నీపై సస్పెన్స్ నెలకుంది. కాగా నేడు ప్రెస్‌మీట్ పెట్టి సీఎం జగన్‌కే తన సపోర్ట్ అంటూ కుండబద్దలు కొట్టారు. పనిలో పనిగా టీడీపీపై, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై, నాయకులపై విమర్శలు గుప్పించారు వంశీ.
వంశీ ప్రెస్ మీట్‌లో మాట్లాడిన ముఖ్యాంశాలు:
- వైపీపీ ప్రభుత్వానికి ఇంకా పురుడు వాసన పోలేదు..అప్పుడే దీక్షలా..?
- అకాల వర్షాలు, వరదలు వస్తే ఇసుక ఎలా తీయగలరు..?
- అపార అనుభవం ఉన్న చంద్రబాబు .. ప్రతిపక్ష నాయకుడి పాత్రను సరిగ్గా పోషించలేకపోతున్నారు
- వర్ధంతికి, జయంతికి తేడా తెలియని వాళ్లు పార్టీని నడిపితే.. అందులో ఎలా ఉండగలం..?
- జగన్‌తో..పరిటాల రవి బ్రతికి ఉన్నప్పటి నుంచి నాకు సత్సంబంధాలు..ఆయనతో నా ప్రయాణం
- పార్టీ మారడం వల్ల నాకు ఎటువంటి ఆర్థిక, రాజకీయ పరమైన లాభాలు లేవు..
- కేసులు కొత్త కాదు..అవి కోర్టు పరిధిలోనివి
- 2009లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి ప్రచారం చేశారు..ఈ పదేళ్లలో అతన్ని ఒక్కసారయినా పట్టించుకున్నారా?..ఆ తర్వాత ఎన్టీఆర్ ఎందుకు పార్టీ కార్యక్రమాల్లో కనిపించలేదు.
- పొత్తు పెట్టుకోవడం..అవసరం తీరిపోయిన వెంటనే బయటకు వచ్చి తిట్టడం చంద్రబాబుకు అలవాటు
- వారసత్వ రాజకీయాలపై నాకు మోజు లేదు