మళ్లీ తెరపైకి ‘ప్రత్యేక హోదా’ అంశం .. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

'మన పాలన - మీ సూచన' కార్యక్రమంలో భాగంగా.. ఇవాళ సీఎం జగన్ 'పరిశ్రమలు-పెట్టుబడుల' అంశంపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా పారిశ్రామిక వేత్తలు, లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా అంశంపై మరోసారి కీలక వ్యాఖ్యలు..

  • Tv9 Telugu
  • Publish Date - 12:53 pm, Thu, 28 May 20
మళ్లీ తెరపైకి 'ప్రత్యేక హోదా' అంశం .. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

‘మన పాలన – మీ సూచన’ కార్యక్రమంలో భాగంగా.. ఇవాళ సీఎం జగన్ ‘పరిశ్రమలు-పెట్టుబడుల’ అంశంపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా పారిశ్రామిక వేత్తలు, లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా అంశంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో చేయలేనిది.. వైసీపీ ఏడాదిలోనే చేసి చూపించామన్నారు. రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం జరిగిందన్నారు. ఏపీకి హోదా ఇచ్చుంటే పారిశ్రామిక రాయితీలు అందుబాటులోకి వచ్చేవన్నారు సీఎం.

ఈ రోజు కాకపోయినా ఏదో ఒకరోజు కేంద్రం మనపై ఆధారపడే పరిస్థితి వస్తుంది. భవిష్యత్తులో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించగలమనే నమ్మకం నాకు ఉంది. గత ప్రభుత్వంలా పొంతన లేని మాటలతో మభ్యపెట్టం. అబద్ధాలు, గ్రాఫిక్స్‌తోనే.. టీడీపీ ప్రభుత్వం కాలం వెళ్లబుచ్చింది. కాగా కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే ఆంధ్రాకి పరిశ్రమలు పెద్దఎత్తున వచ్చేవి. గత ప్రభుత్వం ఏపీకి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రచారం చేసుకుంది. లక్షల కోట్ల పేరుతో ప్రచారం చేసుకున్నారు తప్ప.. లాభం లేదు. పరిశ్రమలకు గత ప్రభుత్వం రూ.20 వేల కోట్ల బకాయిలు పెట్టింది. బకాయిలు ఉంటే రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా వస్తాయని ప్రశ్నించారు జగన్.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తైన సందర్భంగా ‘మన పాలన – మీ సూచన’ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ క్రమంలో రోజుకో అంశంపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమం మే 25వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకూ జరగనుంది. కాగా ఈ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

Read More:

వరంగల్ మర్డర్ మిస్టరీలో బయటపడ్డ మరో కొత్త కోణం.. 10 కూడా కాదు..

మాజీ లవర్స్.. క్లోజ్ ఫ్రెండ్స్..? రానాకు త్రిష వార్నింగ్!

వాహనదారులకు మరో శుభవార్త.. ఇక వాట్సాప్‌ నుంచి రవాణా శాఖ సేవలు..

కరోనా నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌లు