Breaking: ఏబీ వెంకటేశ్వరరావుకు షాక్.. సస్పెన్షన్‌ను సమర్ధించిన క్యాట్..!
ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావుకు క్యాట్ మరోసారి షాక్ ఇచ్చింది. ఆయనపై సస్పెన్షన్‌ను సమర్ధించిన క్యాట్.. ఆయన పిటిషన్‌ను కొట్టేసింది.
ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావుకు క్యాట్ మరోసారి షాక్ ఇచ్చింది. ఆయనపై సస్పెన్షన్‌ను సమర్ధించిన క్యాట్.. ఆయన పిటిషన్‌ను కొట్టేసింది. ఏదైనా ఉంటే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించుకోవాలని క్యాట్ ఏబీ వెంకటేశ్వరరావుకు సూచించింది. కాగా ఏబీ ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసిన సమయంలో భద్రతా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంతో ఏపీ ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ నేపథ్యంలో ఆయన క్యాట్‌ను ఆశ్రయించారు. తనపై విధించిన సస్పెన్షన్‌ను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. నిరాధార ఆరోపణలతో సస్పెండ్ చేయడం విరుద్ధమని ఆయన క్యాట్‌కు తెలిపిన విషయం తెలిసిందే.
Read This Story Also: భారత్‌లో మరో కరోనా పేషెంట్ మృతి..!