Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indus River: పాకిస్థాన్‌ దశ తిరుగుతుందా..? సింధు నది లోయలో భారీగా బంగారం నిల్వలు..

పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌ అటోక్‌ జిల్లాలో ఉన్న సింధు నదిలో భారీగా బంగారం నిల్వలను గుర్తించారు. జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ పాకిస్థాన్‌ కూడా ఆ వివరాలను ధ్రువీకరించింది. సింధు నది పాకిస్థాన్‌ మీదుగా ప్రవహించి హిమాలయాల్లోకి చేరుకుంటుంది. సింధు నది, హిమాలయాల దిగువన టెక్టోనిక్‌ ప్లేట్ల కదలికలు ఎక్కువగా ఉంటాయి.

Indus River: పాకిస్థాన్‌ దశ తిరుగుతుందా..? సింధు నది లోయలో భారీగా బంగారం నిల్వలు..
Indus River Gold Treasure
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 12, 2025 | 5:48 PM

పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌ అటోక్‌ జిల్లాలో ఉన్న సింధు నదిలో భారీగా బంగారం నిల్వలను గుర్తించారు. జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ పాకిస్థాన్‌ కూడా ఆ వివరాలను ధ్రువీకరించింది. సింధు నది పాకిస్థాన్‌ మీదుగా ప్రవహించి హిమాలయాల్లోకి చేరుకుంటుంది. సింధు నది, హిమాలయాల దిగువన టెక్టోనిక్‌ ప్లేట్ల కదలికలు ఎక్కువగా ఉంటాయి. ఆ చర్యల వల్లే అక్కడ బంగారం అణువులు ఏర్పడుతుంటాయి. అవి సింధు నది ప్రవాహం ద్వారా పాకిస్థాన్‌లోని నదీ పరివాహక ప్రాంతం పరిధిలోకి వస్తుంటాయి. వందల ఏళ్ల తరబడి నిరంతరాయంగా సింధు నది ప్రవాహం జరిగిన ఫలితంగా, ఈ బంగారం అణువులన్నీ నదీ లోయలో పలుచోట్ల పేరుకుపోయాయి.

నదిలో బంగారు గని.. జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ పాకిస్థాన్‌ అంచనాల ప్రకారం..

  • 32.6 టన్నుల బంగారం నిల్వలు
  • 18వేల కోట్లు అంటే 600 బిలియన్‌ పాకిస్థానీ రూపాయలు
  • 32 కిలోమీటర్ల పరిధిలో బంగారం నిల్వలు
  • పంజాబ్‌ ప్రావిన్స్, ఖైబర్‌ ఫంఖ్తూన్‌ఖ్వా, పెషావర్‌ బేసిన్, మర్దాన్‌ బేసిన్‌లో బంగారం నిల్వలు

కాగా.. ఇప్పటికే బంగారం నిల్వల వెలికితీత పనులు ప్రారంభమయ్యాయి.. ఆయా ప్రాంతాల్లో అక్రమ మైనింగ్‌పై నిషేధం విధించారు.. అయితే.. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే గనుల్లో మైనింగ్‌ నిర్వహించనున్నట్లు.. పంజాబ్‌ ప్రావిన్స్‌ గనులశాఖ మంత్రి ఇబ్రహీం హసన్‌ ప్రకటించారు..

ఈ బంగారు గనితో పాక్‌ దశ తిరుగుతుందంటున్నారు. పాకిస్థాన్‌లో ఓ వైపు నిత్యావసరాల ధరలు, ఇంధన ధరలు కొండెక్కి ప్రజల జీవితం భారంగా మార్చాయి. మరోవైపు వరుస ఉగ్రదాడులతో ఎంతోమంది ప్రజలు, సైనికులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో బంగారం నిల్వలు బయటపడ్డాయనే వార్త భవిష్యత్తుపై పాక్‌కు కొత్త ఆశలను రేకెత్తించింది.

బంగారం వెలికితీత ప్రక్రియ మొదలైతే పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థ కొత్త రెక్కలు తొడిగేందుకు ఆస్కారం ఉంది. దేశంపై ఉన్న అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు బాటలు పడతాయంటున్నారు. పాక్‌ కరెన్సీ విలువ కొంతమేర బలోపేతం అవుతుందని, వెరసి నిత్యావసరాల ధరలు, ఇంధన ధరలు దిగొచ్చి సామాన్య ప్రజలకు ఊరట లభిస్తుందనే టాక్‌ నడుస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..