సుప్రీం కోర్టులో స్థానికపోరు..నిర్ణయమేంటో !
స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగాల్సిందేనంటూ ఏపీ ప్రభుత్వం పట్టుబడుతుంటే...కరోనా తీవ్రత నేపథ్యంలో కష్టమని ఈసీ తన వాదన వినిపిస్తోంది. మరి సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా ఉండబోతుందన్ని ఉత్కంఠ రేపుతోంది..
ఏపీలో లోకల్ ఎలక్షన్ వాయిదా..రాజకీయంగా కాకరేపుతోంది. సీఎస్-ఈసీ మధ్య లేఖల యుద్ధం కూడా కొనసాగింది. కులం కుంపటి కూడా రాజకుంది. ఇలాంటి సిట్చ్యువేషన్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు వాదనలు జరగనున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగాల్సిందేనంటూ ఏపీ ప్రభుత్వం పట్టుబడుతుంటే…కరోనా తీవ్రత నేపథ్యంలో కష్టమని ఈసీ తన వాదన వినిపిస్తోంది. మరి సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా ఉండబోతుందన్ని ఉత్కంఠ రేపుతోంది.
స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఈ కేసును వెంటనే విచారణకు స్వీకరించాలని ధర్మాసనాన్ని అభ్యర్థించడంతో భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టేలా కేసును జాబితాలో చేర్చేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఆ మేరకు ఇవాళ్టి కేసుల జాబితాలో ఈ కేసును చేర్చారు. ఇదే కేసులో ఇంప్లిడ్ అవుతూ వేసిన మరో రెండు పిటిషన్లను కూడా కలిపి ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈ పిటిషన్‌లో ప్రతివాదిగా ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్, కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. తద్వారా ఈ కేసు విచారణలో కౌంటర్లు దాఖలు చేయడానికి నోటిసులివ్వాల్సిన అవసరం లేకుండానే ప్రతివాది సంసిద్ధమైంది. ఈ నేపథ్యంలో సుప్రీంలో విచారణ ఆసక్తి రేపుతోంది.