బడ్జెట్ సమావేశాలు: రాజధాని పరిసరాల్లో సెక్షన్ 30 అమలు
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అమరావతిలో సెక్షన్ 30 అమలు చేశారు. విజయవాడ, గుంటూరు జిల్లాల్లో ఆందోళనలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఎలాంటి కార్యక్రమాలైనా ధర్నా చౌక్‌లోనే చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. నిరసనలు, ఆందోళనలకు పోలీసుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. కాగా ఇవాళ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు సచివాలయం మొదటి బ్లాక్‌లో ఏపీ కేబినెట్ మీటింగ్ జరగనుంది. అందులో బడ్జెట్‌ను […]
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అమరావతిలో సెక్షన్ 30 అమలు చేశారు. విజయవాడ, గుంటూరు జిల్లాల్లో ఆందోళనలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఎలాంటి కార్యక్రమాలైనా ధర్నా చౌక్‌లోనే చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. నిరసనలు, ఆందోళనలకు పోలీసుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. కాగా ఇవాళ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు సచివాలయం మొదటి బ్లాక్‌లో ఏపీ కేబినెట్ మీటింగ్ జరగనుంది. అందులో బడ్జెట్‌ను లాంఛనంగా ఆమోదించనున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ముసాయిదా బిల్లులపైనా కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. బడ్జెట్ ప్రవేశం తరువాత సభలను సోమవారానికి వాయిదా వేయనున్నారు. కాగా అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ బడ్జెట్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. నవరత్నాల రూపకల్పన.. ముఖ్యంగా రైతులకు మేలు కలిగేలా ఈ బడ్జెట్ ఉండబోతుందని పలువురు భావిస్తున్నారు. మరి వారి అంచనాలను ఈ బడ్జెట్ ఏమాత్రం అందుకుంటుందో చూడాలి.