టెండర్ల రద్దు నిర్ణయం సరికాదు.. పోలవరం అథారిటీ

ఏపీ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయా.? ఇప్పటికే రివర్స్ టెండరింగ్ పేరుతో ఇప్పటికే పనులచేస్తున్న కాంట్రాక్టులను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై కేంద్రం కూడా పెదవి విరిచింది. ఈ విధంగా టెండర్లు రద్దు చేస్తే నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతుందని కూడా పార్లమెంట్‌లో మంత్రి గజేంద్రనాథ్‌సింగ్ చెప్పారు. తాజాగా మంగళవారం హైదరాబాద్‌లో పోలవరం అథారిటీ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో అథారిటీ ఛైర్మన్ ఆర్‌.కె.జైన్‌ ఏపీకి బ్యాడ్ న్యూస్ చెప్పారు. రివర్స్‌ […]

టెండర్ల రద్దు నిర్ణయం సరికాదు.. పోలవరం అథారిటీ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: Aug 14, 2019 | 4:26 PM

ఏపీ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయా.? ఇప్పటికే రివర్స్ టెండరింగ్ పేరుతో ఇప్పటికే పనులచేస్తున్న కాంట్రాక్టులను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై కేంద్రం కూడా పెదవి విరిచింది. ఈ విధంగా టెండర్లు రద్దు చేస్తే నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతుందని కూడా పార్లమెంట్‌లో మంత్రి గజేంద్రనాథ్‌సింగ్ చెప్పారు.

తాజాగా మంగళవారం హైదరాబాద్‌లో పోలవరం అథారిటీ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో అథారిటీ ఛైర్మన్ ఆర్‌.కె.జైన్‌ ఏపీకి బ్యాడ్ న్యూస్ చెప్పారు. రివర్స్‌ టెండరింగ్‌తో ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందని, నిర్మాణంలో జాప్యం జరిగే అవకాశముందన్నారు. సుమారు ఐదు గంటలపాటు ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా పోలవరం టెండర్ల రద్దుపైనే చర్చ జరిగింది. ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కాంట్రాక్టర్ పనితీరు సంతృప్తికరంగానే ఉందన్నారు. మంగళవారం జరిగిన అత్యవసర సమావేశంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సుధీర్ఘంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక అందించాలని నీటి పారుదల శాఖ అధికారులను అథారిటీ ఆదేశించింది.