జగన్ సర్కార్ కీలక నిర్ణయం… ఏపీలో 25 ఆలయాలకు పాలకమండళ్లు!

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దూకుడు పెంచారు. పాలనాపరమైన అంశాలతో పాటూ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. పనిలో పనిగా నామినేటెడ్ పోస్టుల భర్తీపైనా ఫోకస్ పెట్టారు జగన్. ఇటీవలే నామినేటెడ్ పోస్టుల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న సీఎం.. తాజాగా నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 ఆలయాలకు నూతన పాలక మండళ్లు ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.కోటి- రూ.5కోట్ల […]

జగన్ సర్కార్ కీలక నిర్ణయం... ఏపీలో 25 ఆలయాలకు పాలకమండళ్లు!
TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 01, 2019 | 5:51 AM

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దూకుడు పెంచారు. పాలనాపరమైన అంశాలతో పాటూ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. పనిలో పనిగా నామినేటెడ్ పోస్టుల భర్తీపైనా ఫోకస్ పెట్టారు జగన్. ఇటీవలే నామినేటెడ్ పోస్టుల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న సీఎం.. తాజాగా నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 ఆలయాలకు నూతన పాలక మండళ్లు ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా రూ.కోటి- రూ.5కోట్ల మధ్య వార్షిక ఆదాయం ఉన్న అన్ని ఆలయాలకు పాలక మండళ్లు ఏర్పాటుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఈ జాబితాలో.. శ్రీకాకుళం అరసవల్లి సూర్యనారాయణ స్వామి, మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహ స్వామి, అంతర్వేది, అమరావతి అమరేశ్వరస్వామి, పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయాలతో సహా మొత్తం 25 ట్రస్ట్‌ బోర్డులు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పాలక మండళ్ల ఏర్పాటుకు అనుమతి లభించడంతో దేవాదాయ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

పాలకమండళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వైఎస్సార్‌సీపీ నేతలు యాక్టివ్ అయ్యారు. నామినేటెడ్ పోస్టుల కోసం ప్రయత్నాలు షురూ చేసేందుకు సిద్ధమయ్యారు. అధినేత జగన్‌తో పాటూ పార్టీ ముఖ్యనేతల్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. రిజర్వేషన్లు కూడా కల్పిస్తుండటంతో కొందరు తమ భార్యలకు మహిళా కోటాలో ప్రయత్నాలు చేసే అవకాశాలు లేకపోలేదు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu