మందు బాబులూ.. మీకిది మింగుడు పడని వార్త !

ఏపీలోని మందుబాబులకు వెనువెంటనే సర్కార్ బ్యాడ్ న్యూస్ చెప్తుంది. కానీ ఇది వారి కుటుంబాలకు గుడ్ న్యూస్‌ అండీ. అవును సంపూర్ణ మధ్యపాన నిషేధం చేస్తానని..ఎన్నికల ముందు పాదయాత్రలో చెప్పిన జగన్..ఆ దిశగా వడివడిగా అడుగులు ముందుకు వేస్తున్నారు.  తాజాగా మద్యంపై అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ పేరిట ప్రభుత్వం భారీగా పన్నులు పెంచింది. ARET పేరిట అడిషనల్ రిటైల్ ఎక్సైజు టాక్స్ విధిస్తూ ఉత్తర్వులు ప్రభుత్వం. స్వదేశీ, విదేశీ మద్యం సీసాలపై  పరిణామాన్ని బట్టి..కనిష్ఠంగా రూ.10 […]

మందు బాబులూ.. మీకిది మింగుడు పడని వార్త !
Follow us

| Edited By: Rajesh Sharma

Updated on: Oct 01, 2019 | 12:43 PM

ఏపీలోని మందుబాబులకు వెనువెంటనే సర్కార్ బ్యాడ్ న్యూస్ చెప్తుంది. కానీ ఇది వారి కుటుంబాలకు గుడ్ న్యూస్‌ అండీ. అవును సంపూర్ణ మధ్యపాన నిషేధం చేస్తానని..ఎన్నికల ముందు పాదయాత్రలో చెప్పిన జగన్..ఆ దిశగా వడివడిగా అడుగులు ముందుకు వేస్తున్నారు.  తాజాగా మద్యంపై అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ పేరిట ప్రభుత్వం భారీగా పన్నులు పెంచింది. ARET పేరిట అడిషనల్ రిటైల్ ఎక్సైజు టాక్స్ విధిస్తూ ఉత్తర్వులు ప్రభుత్వం. స్వదేశీ, విదేశీ మద్యం సీసాలపై  పరిణామాన్ని బట్టి..కనిష్ఠంగా రూ.10 నుంచి గరిష్ఠంగా రూ. 250 వరకు పెంచింది.

స్వదేశీ, విదేశీ మద్యం క్వార్టర్ సీసాపై రూ. 20, హాఫ్‌పై రూ. 40, ఫుల్‌పై రూ. 80 పెంచారు

లీటరు మద్యం సీసాపై రూ. 100, రెండు లీటర్ల మద్యం సీసాపై రూ. 250 పెంచారు

60/90 మి.లీ పరిమాణంలోని స్వదేశీ మద్యం సీసాపై రూ. 10పెంచారు

చిన్న, హాఫ్ బీర్స్‌పై (330, 500 మిల్లీలీటర్ల పరిమాణం కలిగినవి) రూ.10, పెద్ద బీరు రూ. 20 రేటు పెరిగింది

అంతేకాదు రాష్ట్రంలో మద్యం దుకాణాలను 20శాతం మేర తగ్గించింది ప్రభుత్వం.

ఉదయం 11 నుండి రాత్రి 8 వరకే అమ్మకాలు:

అంతేకాదు వైన్ షాపుల్లో మద్యం అమ్మే వేళల్లో కీలక మార్పులు చేసింది. నేటి నుంచి ఉదయం 11 నుంచి రాత్రి 8 వరకు మాత్రమే మద్యం షాపులు తెరిచి ఉంటాయని వెల్లడించింది ఏపీ సర్కార్. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం అమ్మినా.. బెల్ట్ షాపులను నడిపినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. నేటి నుంచి ప్రభుత్వం దుకాణాల ద్వారానే మద్యం విక్రయాలు జరుగుతాయి. ఏపీలో 4,380 మద్యం షాపులు ప్రభుత్వ ఆధీనంలోనే నడుస్తాయి. పట్టణాలు, నగరాల్లోని మద్యం దుకాణాల్లో ఒక సూపర్ వైజర్, ముగ్గురు సేల్స్‌మెన్ ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక సూపర్ వైజర్, ఇద్దరు సేల్స్‌మెన్ పనిచేస్తారు. కాగా జూన్ నుంచి ఇప్పటివరకు మద్యం విక్రయాలు 15 శాతం తగ్గినట్లు ప్రభుత్వం పేర్కుంది.

ఏపీఎస్‌బీఎస్‌ఎల్‌కు 4 శాతం కమీషన్:

కాగా మద్యం షాపులు నిర్వహించనున్న ఏపీఎస్‌బీఎస్‌ఎల్‌కు 4 శాతం కమీషన్‌ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దుకాణాలు అద్దెలు, సిబ్బంది వేతనాల దృష్యా కేటాయిస్తున్నట్టు పేర్కుంది. ఏపీలోని మందుబాబులకు వెనువెంటనే సర్కార్ బ్యాడ్ న్యూస్ చెప్తుంది. కానీ ఇది వారి కుటుంబాలకు గుడ్ న్యూస్‌ అండీ. అవును సంపూర్ణ మధ్యపాన నిషేధం చేస్తానని..ఎన్నికల ముందు పాదయాత్రలో చెప్పిన జగన్..ఆ దిశగా వడివడిగా అడుగులు ముందుకు వేస్తున్నారు.