సీఎం జగన్‌కు సవాల్ విసురుతూ.. షర్మిల, భారతీలపై లోకేష్ విమర్శలు..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గుంటూరు జిల్లాలో జరిగిన అమరావతి జేఏసీ ర్యాలీలో పాల్గొన్నారు. గుంటూరులోని వీధుల్లో పర్యటిస్తూ.. రాజధాని రైతుల కోసం జోలె పట్టుకుని విరాళాలు సేకరించారు. ఆ తర్వాత జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై ఫైర్ అయ్యారు. రాజధాని మహిళలపై పోలీసులు దాడులకు పాల్పడుతున్నారని.. పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతుంటే.. వారిని పెయిడ్ ఆర్టిస్టులంటూ ఎగతాళి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ […]

సీఎం జగన్‌కు సవాల్ విసురుతూ.. షర్మిల, భారతీలపై లోకేష్ విమర్శలు..
Follow us

| Edited By:

Updated on: Jan 14, 2020 | 6:57 AM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గుంటూరు జిల్లాలో జరిగిన అమరావతి జేఏసీ ర్యాలీలో పాల్గొన్నారు. గుంటూరులోని వీధుల్లో పర్యటిస్తూ.. రాజధాని రైతుల కోసం జోలె పట్టుకుని విరాళాలు సేకరించారు. ఆ తర్వాత జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై ఫైర్ అయ్యారు. రాజధాని మహిళలపై పోలీసులు దాడులకు పాల్పడుతున్నారని.. పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతుంటే.. వారిని పెయిడ్ ఆర్టిస్టులంటూ ఎగతాళి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు మహిళలకు ఇంత ఘోరంగా అవమానం జరుగుతుంటే.. విజయమ్మ, వైఎస్ భారతి ఎక్కడున్నారని ప్రశ్నించారు. రాజధాని అమరావతి కోసం.. తన తల్లి భువనేశ్వరి బంగారు గాజులను విరాళంగా ఇస్తే… వైసీపీ శ్రేణులు వెటకారం చేశారని మండిపడ్డారు. మేము కూడా.. వైఎస్ భారతి, విజయమ్మ, షర్మిల గురించి మాట్లడవచ్చని.. కానీ తమది అలాంటి సంస్కారం కాదన్నారు.

అటు వైఎస్ జగన్‌కు సవాల్ కూడా విసిరారు. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తే.. చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. దమ్ముంటే.. అమరావతి రెఫరెండంగా ఎలక్షన్లకు వెళ్లాలన్నారు.అంతేకాదు.. రాజధాని కోసం అమరావతి రైతులు 33వేల ఎకరాల భూమిని ఇచ్చారని.. అలాంటి రైతన్న త్యాగాన్ని రోడ్డున పడేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన చేపడుతున్న వారిపై ఇష్టారీతిన మాట్లాడుతూ.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ.. ప్రజలు తిరగబడే రోజులు వస్తాయంటూ.. జగన్ సర్కార్‌పై ఫైర్ అయ్యారు లోకేష్.