AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nara Lokesh: ఆయనతో భేటీ నా జీవితంలో కీలక మలుపు.. మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ప్రతి మనిషికి జీవితంలో కొన్ని కీలక మలుపులు ఉంటాయి. అలాగే ప్రధాని మోదీతో జరిగిన సమావేశం తన జీవితంలోనూ కీలక మలుపుల్లో ఒకటిగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లొకేష్‌ తెలిపారు. ఆయనతో జరిగిన సమావేశం మాటలతో వర్ణించలేనిదని లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్‌ కేంద్రమంత్రులతో సమావేశం తర్వాత మీడియాతో చిట్‌చాట్‌ సందర్భంగా ప్రధానితో సమావేశమైన భేటీని ఆయన గుర్తుచేసుకున్నారు.

Nara Lokesh: ఆయనతో భేటీ నా జీవితంలో కీలక మలుపు.. మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Lokesh
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Jun 19, 2025 | 4:48 PM

Share

ఏపీ మంత్రి నారా లోకేష్‌ ఢిల్లీ పర్యటనలో బీజీబీజీగా గడుపుతున్నారు. పలువురు కేంద్రమంత్రులతో సమావేశం అవుతూ రాష్ట్రానికి సంబంధించిన ప్రతిపాదనలు, విజ్ఞప్తులను వారి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర సమస్యలను పరిష్కరించేందుకు సహకరించాలని వారిని కోరారు. కేంద్రమంత్రులతో సమావేశం తర్వాత నేషనల్‌ మీడియాతో జరిగిన చిట్‌చాట్‌ సందర్భంగా ఆయన ప్రధాని మోదీతో కుటుంబ సమేతంగా భేటీ అయిన క్షణాలను గుర్తుచేసుకున్నారు. ప్రతి మనిషికి జీవితంలో కొన్ని కీలక మలుపులు ఉంటాయి. అలాగే ప్రధాని మోదీతో జరిగిన సమావేశం కూడా తన జీవితంలోని కీలక మలుపుల్లో ఒకటిగా నారా లొకేష్‌ తెలిపారు. ఆయనతో జరిగిన సమావేశం మాటలతో వర్ణించలేనిదని లోకేష్ అన్నారు.

ప్రధాని మోదీ ఎవ్వరికీ ఇవ్వనంత సమయం తనకు ఇవ్వడమే కాకుండా.. గొప్ప ప్రేరణ స్ఫూర్తిని కూడా ఇచ్చారని లోకేష్‌ పేర్కొన్నారు. మోడీతో సమావేశం తర్వాత ఆయన మాటలు మననం చేసుకుంటూ చాలాసేపు ఆలోచించానన్నారు లోకేష్. జీవితంలో మున్ముందు ఇంకా ఎలా ఎదగాలి అనే అనేక సూచనలు సలహాలు మోదీ ఇచ్చారన్నారని లోకేష్‌ తెలిపారు. క్రమశిక్షణతో మెలుగు ప్రకృతిని ప్రేమించు అంటూ తన కుమారుడు దేవాన్సుకు మోడీ చెప్పారన్నారు.

మరోవైపు కేంద్రమంత్రులతో భేటీ సందర్భంగా రాష్ట్ర సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లినట్టు లోకేష్ తెలిపారు. వారు సానుకూలంగా స్పందించడంతో పాటు ఏపీకి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం గురించి కూడా ప్రతి ఒక్కరు అడిగారన్నారని తెలిపారు.

ఇక ఏపిలో కూటమి ప్రభుత్వ పాలనపై ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని.. తప్పు చేసిన వారిని మాత్రం చట్ట ప్రకారం శిక్షించి తీరుతుందన్నారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యేల పనితీరుపై నివేదిక తయారు చేస్తున్నామని. ఒక్కొక్క ఎమ్మెల్యేని పిలిచి వాళ్ల పనితీరుపై నివేదిక ఇస్తామన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు తమ పనితీరును మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు..అందుకు ఎమ్మెల్యేలకు 3 నెలల సమయం ఇస్తామని మంత్రి లోకేష్‌ తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..