టీడీపీ నేతలపై ఎంతకాలమీ “కక్ష”..?: వైసీపీ పై లోకేష్ ఫైర్

వైసీపీ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి నారాలోకేష్ విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతల్ని టార్గెట్ చేస్తూ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. టీడీపీ నేతల ఇళ్లను అక్రమ కట్టడాలు అంటూ కూల్చివేస్తున్నారని లోకేష్ ఆరోపించారు. టీడీపీ నేతల్ని టార్గెట్ చేయడమే మీ పనా.. మీకు చేతనైన పరిపాలన ఇదేనా జగన్ గారూ..? అధికారం ఎప్పటికీ మీకు శాశ్వతం కాదని నారాలోకేష్ ట్వీట్ చేశారు. నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురంలో టీడీపీ నాయకులకు చెందిన […]

  • Tv9 Telugu
  • Publish Date - 11:59 am, Wed, 14 August 19
టీడీపీ నేతలపై ఎంతకాలమీ "కక్ష"..?: వైసీపీ పై లోకేష్ ఫైర్

వైసీపీ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి నారాలోకేష్ విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతల్ని టార్గెట్ చేస్తూ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. టీడీపీ నేతల ఇళ్లను అక్రమ కట్టడాలు అంటూ కూల్చివేస్తున్నారని లోకేష్ ఆరోపించారు. టీడీపీ నేతల్ని టార్గెట్ చేయడమే మీ పనా.. మీకు చేతనైన పరిపాలన ఇదేనా జగన్ గారూ..? అధికారం ఎప్పటికీ మీకు శాశ్వతం కాదని నారాలోకేష్ ట్వీట్ చేశారు. నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురంలో టీడీపీ నాయకులకు చెందిన 3 ఇళ్లను అక్రమ కట్టడాల పేరుతో కూల్చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసు యంత్రాంగం కూడా వైసీపీ దౌర్జన్యాలకు అండగా నిలవడం దురదృష్టకరమన్నారు.