మొదటి రోజే చంద్రబాబుకు షాక్.. కేసు నమోదు..!

దాదాపు రెండు నెలల తరువాత ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం ఆంధ్రప్రదేశ్‌కి వచ్చిన విషయం తెలిసిందే.

  • Tv9 Telugu
  • Publish Date - 8:36 am, Tue, 26 May 20
మొదటి రోజే చంద్రబాబుకు షాక్.. కేసు నమోదు..!

దాదాపు రెండు నెలల తరువాత ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం ఆంధ్రప్రదేశ్‌కి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణుల నుంచి ఆయనకు ఘన స్వాగతం లభించింది. అయితే ఆయనకు మొదటి రోజే షాక్‌ తగిలింది. హైదరాబాద్ నుంచి కాన్వాయ్‌లో బయలుదేరిన చంద్రబాబు పలుచోట్ల కారు దిగి మరీ జనాలను పలకరించారు. దీంతో బాబు లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి, కరోనా వైరస్ వ్యాప్తికి పరోక్షంగా కారణమయ్యారంటూ చిత్తూరు జిల్లాకు చెందిన మొహమ్మద్ అలీ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చంద్రబాబు లాక్‌డౌన్‌ రూల్స్‌ ఉల్లఘించారని  వీడియోలను ఆధారాలు సమర్పిస్తూ ఏపీ డీజీపీ, విజయవాడ పోలీస్‌ కమిషనర్, కృష్ణా జిల్లా ఎస్పీతో పాటు తోట్లవల్లూరు పోలీస్‌ స్టేషన్‌లో అలీ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుకు సంబంధించిన కాపీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా దీనిపై తోట్లవల్లూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు కూడా తెలుస్తోంది. ఇదిలా ఉంటే చంద్రబాబు లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ వైసీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి ఏకంగా హైకోర్టుకే ఫిర్యాదు చేయడం గమనర్హం. కాగా ఇవాళ విశాఖకు వెళ్లనున్న చంద్రబాబు అక్కడ స్టెరీన్‌ గ్యాస్‌ బాధితులను కలవనున్నారు.

Read This Story Also: దిల్‌ రాజు ప్లాన్.. బాలీవుడ్‌లో మరో తెలుగు మూవీ రీమేక్‌..!