Godavari Boat Accident: ఆదివారాలే ఎందుకు ఈ ప్రమాదాలు..?

Godavari Boat Accident: ఆదివారాలే ఎందుకు ఈ ప్రమాదాలు..?

2017వ సంవత్సరం నవంబర్ 12వ తేదీ ఆదివారం.. ఓ విషాదకరమైన ఘటన అందరి మనసులనూ కలిచివేసింది. 2017లో ఇలాంటి ప్రమాదానికే గురై.. 22 మంది జల సమాధి అయ్యారు. ఇప్పుడు 2019 సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం.. బోటు ప్రమాదంలో 36 మంది గల్లంతయ్యారు. వీరిలో 12 మంది మరణించారు. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతోన్నాయి. 2017 నవంబర్‌ 12న విజయవాడ సమీపంలోని పవిత్ర సంగమం వద్ద కృష్ణా నదిలో బోటు తిరగబడిన ఘటన, తాజాగా.. తూర్పుగోదావరి […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 16, 2019 | 10:29 AM

2017వ సంవత్సరం నవంబర్ 12వ తేదీ ఆదివారం.. ఓ విషాదకరమైన ఘటన అందరి మనసులనూ కలిచివేసింది. 2017లో ఇలాంటి ప్రమాదానికే గురై.. 22 మంది జల సమాధి అయ్యారు. ఇప్పుడు 2019 సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం.. బోటు ప్రమాదంలో 36 మంది గల్లంతయ్యారు. వీరిలో 12 మంది మరణించారు. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతోన్నాయి.

2017 నవంబర్‌ 12న విజయవాడ సమీపంలోని పవిత్ర సంగమం వద్ద కృష్ణా నదిలో బోటు తిరగబడిన ఘటన, తాజాగా.. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో జరిగిన బోటు ప్రమాదం రెండూ ఆదివారమే జరగడం గమనార్హం. కార్తీక మాసం సందర్భంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి వచ్చిన భక్తులు విజయవాడ కృష్ణానదిలో బోటులో విహారానికి వెళ్లడంతో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 22 మంది జలసమాధి అయ్యారు. శని, ఆదివారాలు సెలవులు కావడంతో తెలంగాణ, ఏపీకి చెందిన అనేక మంది పాపికొండల యాత్రకు వచ్చారు. దీనిపై అప్పటి సీఎం చంద్రబాబు.. సీరియస్‌గా వ్యవహరించారు. అలాగే.. పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ కూడా.. ప్రమాదానికి సంబంధించి.. పలువురిని విధులను నుంచి బహిష్కరించారు.

Why all these River accidents occur on Sundays?

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచలూరు వద్ద ఆదివారం జరిగిన 61 మంది పర్యాటకులతో ప్రయాణిస్తున్న బోటు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 12 మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. గోదావరిలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. చీకటి పడటం, గోదావరి ఉధృతంగా ప్రవహించడం వల్ల గాలింపు చర్యలకు ఆటంకంగా మారింది.

గోదావరి అందాలను చూడాలనుకుని.. ‘రాయల్ వశిష్ఠ’ అనే బోటులో వీరంతా ప్రయాణం చేస్తుండగా.. కచ్చలూరు వద్దకు రాగానే బోటు ఒక్కసారిగా తిరగబడింది. అప్పటికే రెండు సార్లు బోటు.. ప్రమాదం నుంచి తప్పించుకుందని.. కానీ.. మూడోసారి.. అక్కడ సుడిగుండం ఉండటంతో.. బోటు బోల్తా పడినట్లు.. ప్రమాదంలో బతికి బయటపడిన ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో.. చాలా మంది లైఫ్ జాకెట్లు ధరించలేదని.. ధరించిన వారు ప్రాణాలతో బయటపడినట్లు.. పోలీసులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ.. అటు.. ప్రజలు.. ఇటు నిర్వాహకులు కూడా.. వారి క్షేమం గురించి పట్టించుకోకపోవడమే.. ఈ ప్రమాదానికి దారి తీసింది.

కాగా.. గోదావరి నదిలో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉంటున్నాయి. గత ఏడాది 2018లో మే నెలలో దేవీపట్నం నుంచి కొండమొదలుకు.. గిరిజనులతో వెళ్తున్న లాంచీ మంటూరు వద్ద మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించారు. అలాగే.. గత సంవత్సరంలో.. 120మంది ప్రయాణికులతో వెళ్తున్న పర్యాటక బోటు అగ్నిప్రమాదానికి గురైంది. డ్రైవర్‌ అప్రమత్తమై బోటును సమయస్ఫూర్తితో ఒడ్డుకు చేర్చడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా.. ఇటు పాలకులు కానీ.. అటు ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో.. మృతుల సంఖ్య మరింత పెరుగుతోంది. వీటిపై ఎన్ని జాగ్రత్తలు సూచించినా.. పెడచెవిన పెట్టి.. వారి ప్రాణాలను కోల్పోతున్నారు పర్యాటకులు.

Why all these River accidents occur on Sundays?

కాగా.. ఈ తాజాగా.. ఈ బోటు ప్రమాదంపై.. పీఎం ప్రధాని మోదీ, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి, పలువురు ఏపీ మంత్రులు, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu